ETV Bharat / bharat

Rahul Gandhi: రాహుల్‌ ట్విట్టర్‌ ఖాతా పునరుద్ధరణ

రాహుల్​ గాంధీ ట్విట్టర్​ ఖాతాను తాత్కాలికంగా స్తంభింపజేసిన వారం రోజుల తర్వాత తిరిగి పునరుద్ధరించింది ఆ సంస్థ. రాహుల్​తో పాటు మరికొందరు నేతల ఖాతాలను కూడా అన్​లాక్​ చేసినట్లు కాంగ్రెస్​ తెలిపింది.

Twitter unlocks Rahul Gandhi's handle
రాహుల్​ గాంధీ, ట్విట్టర్​
author img

By

Published : Aug 14, 2021, 12:06 PM IST

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఖాతాను పునరుద్ధరించింది ట్విట్టర్​. దిల్లీలో హత్యాచారానికి గురైన ఒక దళిత బాలిక కుటుంబాన్ని పరామర్శించి, ఆ చిత్రాలను పంచుకున్నందుకు ఆయన ఖాతాను ట్విట్టర్‌ గతవారం తాత్కాలికంగా స్తంభింపజేసింది. నిబంధనలను ఉల్లంఘించినందుకే రాహుల్‌ ఖాతాను బ్లాక్‌ చేసినట్లు సంస్థ తెలిపింది.

తాజాగా ఆయన ఖాతాను ట్విట్టర్‌ అన్‌లాక్‌ చేసినట్లు కాంగ్రెస్‌ పార్టీ వెల్లడించింది. రాహుల్‌తో పాటు మరికొందరు పార్టీ నేతల ఖాతాలను కూడా పునరుద్ధరించినట్లు తెలిపింది.

తన ఖాతాను నిలిపివేయడంపై రాహుల్‌ గాంధీ శుక్రవారం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ట్విట్టర్‌ పక్షపాతంతో వ్యవహరిస్తోందని, దేశ రాజకీయ ప్రక్రియలో జోక్యం చేసుకుంటోందని ఆరోపించారు. మన రాజకీయాలపై ఆ కంపెనీ వ్యాపారం చేసుకుంటోందని దుయ్యబట్టారు. ఈ మేరకు యూట్యూబ్‌ వేదికగా ఓ వీడియో సందేశాన్ని పంచుకున్నారు.

మరోవైపు.. ట్విట్టర్‌ ఇండియా అధిపతిగా ఉన్న మనీశ్‌ మహేశ్వరిని అమెరికాకు బదిలీ చేస్తూ ఆ సంస్థ శుక్రవారం అనూహ్య నిర్ణయం తీసుకుంది. విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉన్న వీడియోకు సంబంధించి ఉత్తర్​ప్రదేశ్​లో ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఆయన బదిలీకి కారణమేమిటనేది ట్విట్టర్‌ వెల్లడించలేదు.

ఇదీ చూడండి: 'ట్విట్టర్ పక్షపాతం- సర్కారు చెప్పిందే వేదం!'

'రాహుల్​ ట్విట్టర్​ ఖాతాను అందుకే లాక్​ చేశాం​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.