కేంద్రం ప్రవేశ పెట్టిన కొత్త మార్గదర్శకాలకు కట్టుబడి ఉన్నట్లు ట్విట్టర్ స్పష్టం చేసింది. చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్ నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుందని కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది. కరోనా కారణంగానే ఈ ప్రక్రియ ఆలస్యం అవుతోందని పేర్కొంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలను మరో వారంలో వెల్లడిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు జూన్ 7న కేంద్రానికి లేఖ రాసినట్లు ట్విట్టర్ వర్గాలు బుధవారం వెల్లడించాయి.
ఇప్పటికే నోడల్, గ్రీవెన్స్ అధికారులను నియమించినట్లు ట్విట్టర్ వెల్లడించింది. కేంద్రంతో నిర్మాణాత్మక చర్చలు కొనసాగుతాయని.. భారత్‌లో సేవలకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని ట్విట్టర్ వెల్లడించింది.
జూన్ 5న కేంద్రం పంపించిన ఫైనల్ నోటీస్‌పై సోషల్ మీడియా దిగ్గజం ఇదివరకే స్పందించింది.
ఇదీ చదవండి : ఆ దేశంలో ట్విట్టర్‌పై సస్పెన్షన్ వేటు