ETV Bharat / bharat

వెంకయ్య నాయుడు ఖాతాపై ట్విట్టర్​ తికమక - ట్విట్టర్​

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్విట్టర్​ ఖాతాకు కొద్ది గంటలు బ్లూ బ్యాడ్జ్​ మాయమైంది. సామాజిక మాధ్యమాల్లో ఈ వార్త వైరల్​ అయిన తర్వాత తిరిగి ప్రత్యక్షమైంది. దీనిపై ట్విట్టర్​ ఆలస్యంగా వివరణ ఇచ్చింది.

Venkaiah Naidu twitter
వెంకయ్య ఖాతాపై ట్విట్టర్​ కుప్పిగంతులు
author img

By

Published : Jun 5, 2021, 10:59 AM IST

Updated : Jun 5, 2021, 11:07 AM IST

కేంద్రం నుంచి ఇప్పటికే ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్న ట్విట్టర్​ మరోమారు వార్తల్లో నిలిచింది. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యక్తిగత ఖాతా(M Venkaiah Naidu twitter)కు తొలుత బ్లూ బ్యాడ్జ్​ను తొలగించిన సామాజిక మాధ్యమ దిగ్గజం... కొద్ది గంటల్లోనే పునరుద్ధరించింది. కానీ అప్పటికే ఆ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారిపోయింది.

కారణమేంటి?

ప్రముఖుల, ప్రజా ప్రయోజనాలు ఉన్న ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఈ బ్లూ టిక్​ను ఇస్తుంది ట్విట్టర్(Twitter)​. అయితే వెంకయ్య నాయుడు వ్యక్తిగత ఖాతాకు దీనిని తొలగించింది. శనివారం ఉదయం నుంచి ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది.

Venkaiah Naidu twitter
వెంకయ్య నాయుడు ట్విట్టర్​

వైరల్​ అయిన కొద్ది గంటలకే వెంకయ్య నాయుడు ఖాతాకు తిరిగి బ్లూ బ్యాడ్జ్​ను అతికించింది ట్విట్టర్​.

Twitter restores Venkaiah Naidu's blue badge for personal account
బ్లూ బ్యాడ్జ్​ మళ్లీ ప్రత్యక్షం

స్పందించిన ట్విట్టర్​..

సంబంధిత ఖాతాను ఉపయోగించి ఎక్కువ రోజులు గడిస్తే బ్లూ టిక్​ తీసివేయొచ్చని ట్విట్టర్​ నిబంధనల్లో ఉంది. చివరిగా 2020 జులై 23న వెంకయ్య నాయుడు ఈ ఖాతా నుంచి ట్వీట్​ చేశారు. అందుకే బ్లూట్​ టిక్​ను తొలగించామని ట్విట్టర్​ ఆలస్యంగా వివరణ ఇచ్చింది.

ఇదీ చూడండి:- Twitter: 'ఐటీ నియమాలను ట్విట్టర్​ పాటించదా?'

Last Updated : Jun 5, 2021, 11:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.