ETV Bharat / bharat

'ట్విట్టర్​ రాజకీయం'లో కొత్త ట్విస్ట్​- ఇక కాంగ్రెస్​తో... - ravi shankar prasad twitter account blocked

కాంగ్రెస్​ అధికారిక ఖాతా సహా పలువురు కీలక నేతల అకౌంట్లను ట్విట్టర్​ బ్లాక్​ చేయడం రాజకీయంగా దుమారం రేపింది. కేంద్రప్రభుత్వం ఒత్తిడి మేరకే ట్విట్టర్​ ఇలా చేస్తోందని ఆరోపిస్తోంది కాంగ్రెస్. అలాంటిదేం లేదన్నది ట్విట్టర్​ మాట. ఇంతకీ ఎవరి వాదన నిజం? గతంలో అధికార పక్ష నేతల ఖాతాలపై చర్యలతో వివాదాస్పదమైన ట్విట్టర్​.. ఇప్పుడు విపక్ష నేతల అకౌంట్లు బ్లాక్​ చేయడం వెనుక కారణాలేంటి?

Twitter politics are changed - this time on Congress!
మారిన ట్విట్టర్​ రాజకీయ రగడ - ఈసారి కాంగ్రెస్​పై!
author img

By

Published : Aug 12, 2021, 7:41 PM IST

కొంతకాలం క్రితం సాగిన 'కేంద్రం వర్సెస్ ట్విట్టర్' రగడకు సంక్షిప్త రూపమిది. ​ఈ వివాదాల కథ ఇంకా ముగియలేదు. అయితే పాత్రలు మాత్రం మారాయి. అధికార పక్షం స్థానంలో ఇప్పుడు విపక్షం వచ్చింది. కాంగ్రెస్​ వర్సెస్​ ట్విట్టర్.. రాజకీయంగా చర్చనీయాంశమైంది.

కాంగ్రెస్​-ట్విట్టర్​ గొడవేంటి?

గత వారం మొదలైందీ రగడ. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ అకౌంట్​ను ట్విట్టర్ బ్లాక్ చేయడం వివాదానికి ఆజ్యం పోసింది.

దిల్లీలో ఇటీవల ఓ 9 ఏళ్ల బాలిక హత్యాచారానికి గురైంది. ఆమె ఇంటికెళ్లి, కుటుంబసభ్యుల్ని కలిసిన రాహుల్.. సంబంధిత ఫొటోను ట్విట్టర్​లో షేర్ చేశారు. చట్ట ప్రకారం అత్యాచార బాధితులు, వారి సంబంధీకుల ఫొటోలు, ఇతర వివరాల్ని బహిర్గతం చేయడం నిషేధం. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘం(ఎన్​సీపీసీఆర్​) ఇదే విషయంపై స్పందించింది. నిబంధనలు ఉల్లంఘించిన రాహుల్ ఖాతాపై చర్యలు తీసుకోవాలని ట్విట్టర్​ను ఆదేశించింది. అందుకు అనుగుణంగా అకౌంట్ బ్లాక్ చేసింది ట్విట్టర్.

వారంలోనే మరో భారీ షాక్​

రాహుల్​ ఖాతాను బ్లాక్ చేయడంపై కాంగ్రెస్​ తీవ్రంగా స్పందించింది. భావప్రకటన స్వేచ్ఛను ట్విట్టర్​ హరిస్తోందని మండిపడింది. కాంగ్రెస్​ నేతలంతా రాహుల్​కు సంఘీభావం ప్రకటించారు. తమ సొంత ట్విట్టర్​ ఖాతాల పేర్లను 'రాహుల్ గాంధీ'గా మార్చారు. ప్రొఫైల్​ పిక్​గానూ తమ యువ నేత ఫొటో పెట్టారు.

ఈ వివాదం సద్దుమణగకముందే కాంగ్రెస్​కు మరో భారీ షాక్ తగిలింది. ఏకంగా పార్టీ అధికారిక ఖాతా బ్లాక్ అయింది. పార్టీ ప్రధాన కార్యదర్శులు రణ్​దీప్​ సుర్జేవాలా, కేసీ వేణుగోపాల్, అజయ్ మాకెన్ సహా మొత్తం 5 వేల మంది కీలక నేతల అకౌంట్లదీ ఇదే పరిస్థితి అని ఆరోపించింది కాంగ్రెస్.

"కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి కారణంగా ట్విట్టర్​ విపక్ష నేతల ఖాతాలను బ్లాక్ చేస్తోంది. షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ ఇలాంటి ఫొటోలే(రాహుల్​ షేర్ చేసిన ఫొటో వంటివి) షేర్ చేసింది. కొద్దిరోజులు అవి అలానే ఉన్నాయి. అయినా ఆ ఖాతాపై ట్విట్టర్​ చర్యలు తీసుకోలేదు. దీనిబట్టి ప్రభుత్వ ఒత్తిడే కారణమన్నది సుస్పష్టం."

-రోహన్ గుప్తా, కాంగ్రెస్​ సోషల్ మీడియా విభాగం సారథి

"పోలీసులను అడ్డంపెట్టుకుని కేంద్రంలోని పెద్దలు ట్విట్టర్​ను ఎంత బెదిరిస్తారు? ఇది భావ ప్రకటన స్వేచ్ఛ మాత్రమే కాదు. పేద, దళిత బాలికకు న్యాయం కోసం గళం విప్పడానికి సంబంధించిన అంశం. ఆ పేద బాలికకు న్యాయం జరిగే వరకు మేము పోరాడతాం. మోదీ ప్రభుత్వం పిరికిపందలా ట్విట్టర్​ను బెదిరించి మా వాణిని అణిచివేయలేదు."

-రణ్​దీప్​ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి

ట్విట్టర్​ వాదన మరోలా..

రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతల ఖాతాలతో పాటు కాంగ్రెస్ అధికారిక అకౌంట్​ను బ్లాక్ చేయడాన్ని సమర్థించుకుంది ట్విట్టర్. నిబంధనలకు విరుద్ధంగా ఓ ఫొటోను పోస్ట్ చేసినందుకు ఖాతాలపై చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. వ్యక్తిగత గోప్యతను కాపాడేందుకే ఇలా చేసినట్లు వివరించింది. సంస్థ రూల్స్​ను పక్షపాతం లేకుండా అమలు చేస్తున్నట్లు తేల్చి చెప్పింది.

'మా నియమాలను ఉల్లంఘించేలా ఓ చిత్రాన్ని పోస్ట్ చేసినందుకు వేల ట్వీట్లపై చర్యలు తీసుకున్నాం. భవిష్యత్తులోనూ ఇలాగే చర్యలు చేపడతాం' అని స్పష్టం చేశారు ట్విట్టర్ అధికార ప్రతినిధి.

ఇలాంటి కేసుల్లో ట్విట్టర్​ రూల్స్​ ఏంటి?

వ్యక్తిగత గోప్యతను కాపాడేందుకు, సమాజంలో వైషమ్యాలు రాకుండా చూసేందుకు ట్విట్టర్​ కొన్ని నిబంధనలు రూపొందించింది. వీటిని ఉల్లంఘించి ఎవరైనా ట్వీట్ చేస్తే.. ఆ పోస్టును హైడ్​ చేసి, నోటీసులు ఇస్తుంది. ఆ అకౌంట్​ హోల్డరే ఆ ట్వీట్​ను డిలీట్ చేసేవరకు ఖాతాను లాక్​ చేసి ఉంచుతుంది. ఒకవేళ అకౌంట్​ హోల్డర్​ తాను నిబంధనలు ఉల్లంఘించలేదని చేసిన అపీల్​లో నిజం ఉందని భావించినా.. ట్విట్టర్​ ఆ ఖాతాను అన్​లాక్ చేస్తుంది.

ఈ నిబంధనల ప్రకారమే కాంగ్రెస్​ నేతల అకౌంట్లను లాక్​ చేశామన్నది ట్విట్టర్ వాదన.

'సోషల్'​ రాజకీయం

ట్విట్టర్​తో వివాదంలో ఇతర విపక్షాలు కాంగ్రెస్​కు మద్దతు ప్రకటిస్తున్నాయి. అకౌంట్లు బ్లాక్ చేయడాన్ని ఖండించింది టీఎంసీ.

"భాజపా ఇకపై సోషల్​ మీడియానూ నియంత్రించేలా కనిపిస్తోంది. అసలు ఎవరు ఏం ట్వీట్ చేయాలి, ఏం ట్వీట్ చేయకూడదు అనేది కూడా భాజపా వాళ్లే నిర్ణయిస్తారు. భాజపా సిద్ధాంతాలు, రాజకీయాలను వ్యతిరేకించడానికి, ట్విట్టర్​ ఖాతాలు బ్లాక్ చేయడానికి ఏమైనా సంబంధం ఉందేమో చూడాలి" అని అన్నారు టీఎంసీ బంగాల్ విభాగం ప్రధాన కార్యదర్శి కునాల్ ఘోష్.

జాతీయ రాజకీయాల్లో ప్రాధాన్య అంశంగా మారిన ట్విట్టర్ రగడ.. మున్ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.

ఇదీ చూడండి.. ఆ సీఎంలకు సోనియా విందు- అసలు లక్ష్యం అదే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.