దిల్లీ సరిహద్దులో నిరసన చేస్తున్న రైతుపై ఓ పోలీసు లాఠీ ఎత్తిన వీడియోను పోస్ట్ చేసిన భాజపా ఐటీ సెల్ ఇంఛార్జి అమిత్ మాలవీయకు ట్విట్టర్ షాక్ ఇచ్చింది. ఆయన ట్వీట్‌కు 'మ్యానిప్యులేటెడ్(తారుమారు చేసిన) మీడియా' లేబుల్‌ను జత చేసింది.
-
Rahul Gandhi must be the most discredited opposition leader India has seen in a long long time. https://t.co/9wQeNE5xAP pic.twitter.com/b4HjXTHPSx
— Amit Malviya (@amitmalviya) November 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Rahul Gandhi must be the most discredited opposition leader India has seen in a long long time. https://t.co/9wQeNE5xAP pic.twitter.com/b4HjXTHPSx
— Amit Malviya (@amitmalviya) November 28, 2020Rahul Gandhi must be the most discredited opposition leader India has seen in a long long time. https://t.co/9wQeNE5xAP pic.twitter.com/b4HjXTHPSx
— Amit Malviya (@amitmalviya) November 28, 2020
ఏం జరిగిందంటే?
సింఘు సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఓ వృద్ధ రైతుపై పోలీసు లాఠీ ఎత్తాడు. ఇందుకు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

ఈ ఫొటోను రాహుల్ గాంధీ తన ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ.. ప్రధాని మోదీ అహంకారం వల్ల రైతులకు జవాన్లు వ్యతిరేకంగా నిలబడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాహుల్ ట్వీట్‌కు నవంబర్ 28న మాలవీయ స్పందించారు. లాఠీ ఎత్తిన ఫొటోకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. పోలీసు లాఠీ రైతుకు అసలు తగలలేదని అన్నారు.
అయితే రైతులను పారామిలిటరీ దళాలు లాఠీతో కొట్టిన పలు వీడియోలు ట్విట్టర్లో వైరల్ అయ్యాయి. మాలవీయ మాత్రం.. రైతులపై పోలీసులు లాఠీ ఛార్జి చేయలేదంటూ.. కొన్ని సెకన్ల వీడియోనే తన ట్వీట్లో చూపించారు.
నిబంధనల ప్రకారం.. కల్పితమైన, మోసపూరితంగా మార్చిన కంటెంట్‌కు ట్విట్టర్ రెడ్ ఫ్లాగ్ జత చేస్తుంది. మోసపూరిత పద్ధతిలో షేర్ చేసిన లేదా, ప్రజా భద్రతకు భంగం కలిగించేదిగా ఉన్న పోస్టులకు ఈ విధమైన లేబుళ్లను జత చేస్తుంది.