ETV Bharat / bharat

ట్విట్టర్‌ గ్రీవెన్స్‌ అధికారి గుడ్‌బై - మనీష్ మహేశ్వరి న్యూస్

ట్విట్టర్ ఇండియా తాత్కాలిక రెసిడెంట్‌ గ్రీవెన్స్‌ అధికారి తన పదవి నుంచి తప్పుకున్నారు. నూతన ఐటీ నిబంధనలకు అనుగుణంగా ఇటీవలే నియమితులైన ధర్మేంద్ర చాతుర్‌ ఆ పదవి నుంచి వైదొలిగారు. మరోవైపు ట్విట్టర్ ఇండియా ఎండీని దర్యాప్తు చేసేందుకు తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని యూపీ గాజియాాబాద్ పోలీసులు తెలిపారు.

twitter
ట్విట్టర్
author img

By

Published : Jun 28, 2021, 5:06 AM IST

ట్విట్టర్ ఇండియా తాత్కాలిక రెసిడెంట్‌ గ్రీవెన్స్‌ అధికారి తన పదవికి గుడ్‌బై చెప్పారు. నూతన ఐటీ నిబంధనలకు అనుగుణంగా ఇటీవలే నియమితులైన ధర్మేంద్ర చాతుర్‌ ఆ పదవి నుంచి వైదొలిగారు. అందుకు గల కారణాలు తెలియరాలేదు. దీనిపై స్పందించేందుకు ట్విట్టర్ సైతం నిరాకరించింది. భారత ప్రభుత్వానికి, ట్విట్టర్​కు​ మధ్య వివాదం నెలకొన్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.

50 లక్షల యూజర్లను కలిగిన సోషల్‌మీడియా కంపెనీలు భారత్‌కు చెందిన ముగ్గురు అధికారులను నియమించుకోవాలని, వారి వివరాలను పొందుపరచాలని నూతన ఐటీ నిబంధనలు చెబుతున్నాయి. ఆ మేరకు మిగిలిన సోషల్‌మీడియా కంపెనీలు గ్రీవెన్స్‌ అధికారులతో పాటు ఇతర అధికారులను నియమించుకున్నాయి. ట్విట్టర్ మాత్రం ఈ విషయంలో ఆలస్యం చేసింది. కేంద్ర ప్రభుత్వం చివరి నోటీసుకు స్పందిస్తూ చీఫ్‌ కాంప్లియన్స్‌ అధికారిని నియమిస్తామని, అదే సమయంలో చాతుర్‌ను తాత్కాలిక గ్రీవెన్స్‌ అధికారిగా నియమిస్తున్నట్లు తెలిపింది. కొద్దిరోజులకే ఆయన వైదొలగడంతో గ్రీవెన్స్‌ అధికారి స్థానంలో ఆయన పేరును తొలగించింది. ప్రస్తుతం అమెరికా అడ్రస్‌, ఈ-మెయిల్‌ ఐడీతో కూడి మరొకరి పేరు చూపుతోంది.

తదుపరి చర్యలు తీసుకుంటాం..

ట్విట్టర్​ ఇండియా ఎండీ మనీష్​ మహేశ్వరిపై తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు ఉత్తర్​ప్రదేశ్ గాజియాబాద్ పోలీసులు. ఈ మేరకు ఎండీని దర్యాప్తు చేసేందుకు మంగళవారంలోపు కర్ణాటక హైకోర్టు అనుమతి కోరనున్నారు.

ఓ మతానికి చెందిన వృద్ధుడిపై దాడి చేసిన కేసులో దర్యాప్తునకు హాజరుకావాలని ట్విట్టర్​ ఇండియా ఎండీ మనీష్ మహేశ్వరికి యూపీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు లోనీ బోర్డర్‌ పోలీస్‌ స్టేషన్‌లో వివరణను రికార్డు చేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే.. వ్యక్తిగత కారణాలు ఉన్నాయని చెప్పి.. జూన్​ 24న ఈ దర్యాప్తునకు హాజరుకాలేదు మనీష్. ఈ విధంగా చేయడం వల్ల ట్విట్టర్​ ఎండీకి సమస్యలు మరింత కఠినమవుతాయని ఓ న్యాయ నిపుణుడు అభిప్రాయపడ్డారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.