ETV Bharat / bharat

కవల అక్కాచెల్లెళ్లను పెళ్లాడిన 'ట్రావెల్​ ఏజెంట్'.. గట్టి షాకిచ్చిన పోలీసులు! - వరుడితో ఇద్దరు వధువుల పెళ్లి

ఇద్దరు కవల సోదరీమణులు ఒకే వ్యక్తిని పెళ్లాడారు. ఈ అరుదైన వివాహం మహారాష్ట్రలో జరిగింది. సోషల్ మీడియాలో వైరలైన ఈ వివాహ దృశ్యాలు పోలీసుల దృష్టికి చేరడం వల్ల వరుడిపై కేసు నమోదు చేశారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Dec 4, 2022, 5:49 PM IST

Updated : Dec 4, 2022, 7:18 PM IST

కవల అక్కాచెల్లెళ్లను పెళ్లాడిన వరుడు

మహారాష్ట్ర సోలాపుర్​లో అరుదైన వివాహం జరిగింది. ఇద్దరు కవల సోదరీమణులు ఒకే వ్యక్తిని పెళ్లాడారు. ఈ పెళ్లి వేడుకకు అక్లూజ్​-వేలాపుర్​ రోడ్డులోని గలాండే హోటల్​ వేదికైంది.
వరుడు అతుల్​ స్వస్థలం సోలాపుర్​ కాగా.. కవల వధువుల ముంబయిలోని కండివాలికి చెందినవారు. అతుల్.. ట్రావెల్ ఏజెంట్​గా పనిచేస్తున్నాడు. వధువులు పింకీ, రింకీ.. సాఫ్ట్​వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగం చేస్తున్నారు. వీరి తండ్రి కొన్నాళ్ల క్రితం మరణించాడు. ఆరు నెలల క్రితం పింకీ, రింకీ, వీరి తల్లి అనారోగ్యానికి గురైంది. ఆ సమయంలో అతుల్ తన ట్యాక్సీలో వీరిని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అప్పడే ఇద్దరు కవల సోదరీమణులతో అతుల్​కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి ఇరువురి కుటుంబ సభ్యులను ఒప్పించి మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.

twin sisters marry same man
ఒకే వ్యక్తిని పెళ్లాడిన కవల సోదరీమణులు

రింకీ, పింకీలు ఇద్దరూ ఉన్నత చదువులు చదివారు. ఒకే ఐటీ కంపెనీలో ఉద్యోగాలు సాధించారు. చిన్నప్పటి నుంచి చాలా అన్యోన్యంగా ఉంటున్నారు. అందుకే ఇద్దరూ ఒకే వరుడిని వివాహం చేసుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వివాహ దృశ్యాలు పోలీసులు దృష్టికి చేరాయి. వరుడిపై ఐపీసీ సెక్షన్‌ 494 ప్రకారం నాన్‌ కాగ్నిజబుల్‌ నేరం కింద పోలీసులు కేసు నమోదుచేశారు.

twin sisters marry same man
వరుడి మెడలో పూలదండలు వేస్తున్న వధువులు

Last Updated : Dec 4, 2022, 7:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.