ETV Bharat / bharat

శ్రీవారి భక్తులకు గుడ్​న్యూస్​ - వైకుంఠ ఏకాదశి ద్వార దర్శన టికెట్లు విడుదల! - TTD

TTD Vaikunta Ekadasi Darshan Tickets in Online : శ్రీవారి భక్తులకు గుడ్​న్యూస్​. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని.. వైకుంఠ ఏకాదశి ద్వార దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేస్తోంది. వెంటనే బుక్ చేసుకోండి.

TTD Vaikunta Ekadasi Darshan Tickets
TTD Vaikunta Ekadasi Darshan Tickets in Online
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 10, 2023, 10:00 AM IST

Updated : Nov 10, 2023, 10:16 AM IST

TTD Vaikunta Ekadasi Darshan Tickets 2023 in Online : శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శుభవార్త తెలిపింది. డిసెంబర్​ 23న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని.. వెంకటేశ్వరస్వామి వైకుంఠ ఏకాదశి ద్వార దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఇవాళ (నవంబర్ 10) విడుదల చేసింది. డిసెంబరు 23 నుంచి జనవరి 1 వరకు కొనసాగనున్న.. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల(ఎస్‌ఈడీ)ను ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేసింది. మొత్తం 2.25 లక్షల టికెట్లను ఆన్​లైన్​లో ఉంచింది. భక్తులు ttddevasthanam.ap.gov.in వెబ్​సైట్​లో టికెట్లు బుక్​ చేసుకోవాలని సూచించింది.

మధ్యాహ్నం శ్రీవాణి ట్రస్టు టికెట్లు విడుదల: అదే విధంగా మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనున్నారు. రోజుకు 2 వేల టికెట్ల చొప్పున.. 10 రోజుల పాటు 20 వేల టికెట్లను టీటీడీ విడుదల చేస్తుంది. సాయంత్రం 5 గంటలకు వసతి గదుల కోటాను అందుబాటులో ఉంచనుంది.

శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా? తిరుమల కొండపై ఈ 5 తప్పులు చేయకండి!

పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం: లోక సంక్షేమం కోసం తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో గురువారం లక్ష కుంకుమార్చన కనులపండువగా నిర్వహించారు. పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం అయ్యాయి. ఉత్సవాలకు ముందు రోజు ఆలయంలో కుంకుమార్చన నిర్వహించడం ఆనవాయితీ. ఉదయం ఏడు గంటలకు ఉత్సవమూర్తిని వేంచేపుగా ముఖమండపానికి తీసుకొచ్చి పెద్దశేష వాహనంపై కొలువుదీర్చారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అమ్మవారికి పూజ చేశారు. బ్రహ్మోత్సవాలు విజయవంతంగా సాగాలని కోరుతూ సాయంత్రం 6.30 గంటల నుంచి 8.30 గంటల మధ్య అంకురార్పణ నిర్వహించారు. శుక్రవారం ఉదయం ధ్వజారోహణంతో అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. రాత్రి చిన్నశేష వాహనసేవ జరగనుంది.

TTD Alert : భక్తులకు అలర్ట్.. తిరుమల వెళ్తున్నారా? ఈ విషయం తెలియకుంటే ఇబ్బంది పడతారు!

బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా నవంబర్​ 14న గజ వాహనం, 15న స్వర్ణ రథం, గరుడ వాహనం, 17న రథోత్సవం, 18న పంచమితీర్థం, 19న పుష్పయాగం నిర్వహిస్తారని టీటీడీ ఛైర్మన్​ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయన్నారు. విశేషమైన పంచమి తీర్థం నాడు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు విచ్చేసి పుణ్యస్నానాలు ఆచరిస్తారని తెలిపారు. ఇందుకోసం పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు, ఇతర సౌకర్యాలను కల్పిస్తున్నామని వివరించారు.

వీఐపీ బ్రేక్​ దర్శనాలు రద్దు: శ్రీవారి ఆలయంలో ఈ నెల 12న దీపావళి ఆస్థానం సందర్భంగా.. వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రొటోకాల్‌ దర్శనం మినహా మిగిలిన బ్రేక్‌ దర్శనాలు రద్దు చేశామని.. 11న బ్రేక్‌ దర్శనానికి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని వెల్లడించింది.

IRCTC Hyderabad to Tirupati Tour : హైదరాబాద్ To తిరుపతి.. హ్యాపీగా శ్రీనివాసుడి దర్శనం.. టికెట్ ఎంతో తెలుసా?

TTD LATEST NEWS: తిరుమల నడకదారుల్లో ప్రతి భక్తుడి చేతికి కర్ర… కరుణా 'కర్ర' రెడ్డి చారిత్రాత్మక వింత నిర్ణయం

How to Book TTD Special Darshan Tickets : తిరుమల స్పెషల్ దర్శనం టికెట్లు.. ఎలా బుక్ చేసుకోవాలో మీకు తెలుసా..?

Last Updated : Nov 10, 2023, 10:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.