ETV Bharat / bharat

TTD Tirumala Seva Tickets for November : తిరుమల శ్రీవారి సేవాటికెట్లు.. నేడే విడుదల! - తిరుమల స్వామివారి ప్రత్యేక దర్శనం

తిరుమల కొండపై శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించిన పలు రకాల టికెట్లను టీటీడీ విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా.. ఆర్జిత సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ కోటాను ఇవాళ (ఆగస్టు 19న) విడుదల చేస్తోంది.

TTD Seva Tickets for November
TTD Tirumala Seva Tickets for November
author img

By

Published : Aug 19, 2023, 10:41 AM IST

When Tirumala Seva tickets Release : తిరుమల ఏడుకొండలపై కొలువైన ఆ వేంకటేశ్వరుని దర్శించుకునేందుకు భక్తులు ప్రపంచ నలుమూలల నుంచీ తరలివస్తుంటారు. కాలి నడకన కొండెక్కి.. స్వామి దర్శనం చేసుకునే వారి సంఖ్య కూడా వేలల్లో ఉంటుందంటే.. కలియుగ దైవానికి భక్తులు ఏ స్థాయిలో ఉంటారో అర్థం చేసుకోవచ్చు. అయితే.. స్వామివారిని భక్తులు మరింత ప్రీతిపాత్రంగా సేవించుకునేందుకు పలు ఆర్జిత సేవలను ప్రవేశపెట్టింది. ఇందులో పలురకాల టికెట్లను నేటి నుంచి విడుదల చేయబోతోంది. మరి, ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

ఎలక్ట్రానిక్ డిప్ కోటా..

Seva Electronic Dip TTD 2023 :

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ కోటాను టీటీడీ ఇవాళ విడుదల చేయబోతోంది. ఇవి నంబర్ నెలకు సంబంధించిన టికెట్లు. ఇవి 19 ఆగస్టు 2023న శనివారం ఉదయం 10 గంటల నుంచి ఆన్​లైన్లో అందుబాటులో ఉంటాయి. 21 ఆగస్టు 2023 సోమవారం ఉదయం 10 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని టీటీడీ ప్రకటించింది.

TTD Varalakshmi Vratham Tickets : తిరుమలలో వరలక్ష్మీ వ్రతం.. టికెట్లు విడుదల.. బుక్​ చేసుకోండిలా

ఇంకా మరిన్ని సేవల టికెట్లు..

మరికొన్ని రకాల సేవల టికెట్లను కూడా టీటీడీ రిలీజ్ చేస్తోంది. ఆర్జిత సేవలైన.. సహస్ర దీపాలంకరణ సేవ, ఊంజల్ సేవ, కల్యాణం, ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లను కూడా విడుదల చేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఈ టికెట్లు ఆగస్టు 22న ఉదయం 10 గంటలకు ఆన్​లైన్​లో విడుదల చేయనున్నట్టు వెల్లడించింది.

అంగ ప్రదక్షిణ కోటా..

అంగ ప్రదక్షిణ కోటా టికెట్లను కూడా టీటీడీడీ విడుదల చేయబోతోంది. నవంబర్ నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణ టికెట్లను ఆగస్టు 23న ఉదయం 10 గంటలకు ఆన్​ లైన్​లో రిలీజ్ చేయనుంది. భక్తులు ఈ విషయాలను గమనించి.. స్వామివారి సేవకు పాత్రులు కావాలని కోరారు.

TTD LATEST NEWS: తిరుమల నడకదారుల్లో ప్రతి భక్తుడి చేతికి కర్ర… కరుణా 'కర్ర' రెడ్డి చారిత్రాత్మక వింత నిర్ణయం

చిరుతల అడ్డగింతకు...

Operation Cheetah :

కాలిబాట మార్గంలో చిరుత ఓ చిన్నారి ప్రాణాలు బలిగొన్న నేపథ్యంలో.. పోలీసు, అటవీ, అరోగ్య శాఖ అధికారులతో టీటీడీ సమావేశం నిర్వహించింది. వన్య మృగాల దాడిని అడ్డుకునేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలిపిరి మెట్ల మార్గంలో.. తినుబండారాలు విక్రయించే దుకాణాలు దాదాపు వందకు పైగా ఉన్నాయి. భక్తులు వీటిలోని పండ్లు, కూరగాయలు కొనుగోలు చేసి సాధు జంతువులకు తిపించడం వల్లే.. వన్య మృగాలు ఇటువైపు వస్తున్నాయని అధికారులు భావిస్తున్నారు. అందుకే.. ఇకనుంచి ఆ దుకాణాల్లో పండ్లు, కూరగాయల విక్రయించకూడదని టీటీడీ ఈవో సూచించినట్టు సమాచారం.

సీసీ కెమెరాల ఏర్పాటు..

CC Cameras in Tirumala :

తిరుపతి మెట్ల మార్గంలో ఇప్పటి వరకూ పెద్దగా సీసీ కెమెరాలు లేవు. అయితే.. వరుసగా జరుగుతున్న చిరుత దాడుల నేపథ్యంలో.. కాలినడక మార్గంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని టీటీడీ భావిస్తోందని ఈవో చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.