ETV Bharat / bharat

TTD Tirumala Navaratri Brahmotsavam Schedule 2023 : తిరుమల బ్రహ్మోత్సవాల షెడ్యూల్ ఇలా.. ఎప్పట్నుంచి అంటే..?

TTD Tirumala Navaratri Brahmotsavam Schedule 2023 : శ్రీవారి భక్తులకు శుభవార్త. ఈ ఏడాది తిరుమల బ్రహ్మోత్సవాలు రెండు సార్లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పటికే సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగియగా తాజాగా అక్టోబర్​లో నిర్వహించే శ్రీనివాసుడి నవరాత్రి బ్రహ్మోత్సవాల షెడ్యూల్ విడుదలైంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

TTD Tirumala Navaratri Brahmotsavam Schedule

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 29, 2023, 4:31 PM IST

TTD Tirumala Brahmotsavam October Schedule : ఈ ఏడాది అధిక మాసం కారణంగా అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడికి రెండు సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. సాధారణంగా ప్రతి ఏడాది ఒకసారి మాత్రమే ఈ వేడుకలు నిర్వహిస్తుంటారు. అయితే.. చాంద్రమానం ప్రకారం ప్రతి మూడో సంవత్సరం అధికమాసం వస్తూ ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు కన్యామాసం(భాద్రపదం)లో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు, దసర నవరాత్రుల్లో(ఆశ్వయుజం) అఖిలాండ నాయకునికి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఇప్పటికే తిరుమలలో సెప్టెంబ‌రు 18 నుంచి 26 వ‌రకు సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలు(Tirumala Salakatla Brahmotsavam) అంగరంగవైభవంగా జరిగిన విషయం తెలిసిందే.

ఇక తదుపరి నిర్వహించే నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తిరుమల(Tirumala) పుణ్యక్షేత్రం సిద్ధమవుతోంది. అక్టోబర్​లో జరిగే ఈ బహ్మోత్సవాలకు సంబంధించి షెడ్యూల్​ను విడుదల చేసింది. ఇంతకీ బహ్మోత్సవాలు అంటే ఏమిటి? వార్షిక బ్రహ్మోత్సవాలు, నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తేడా ఏంటి? అలాగే నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఎప్పుడు మొదలుకానున్నాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

TTD Tirumala Brahmotsavam : పురాణాల ప్రకారం తిరమల శ్రీనివాసుడు వేంకటాద్రిపై వెలిసిన తొలినాళ్లలోనే బ్రహ్మదేవున్ని పిలిచి లోకకల్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించారట. స్వామివారి ఆజ్ఞ ప్రకారమే వేంకటేశ్వరుడు ఆనంద నిలయం మధ్యలో ఆవిర్భవించిన కన్యామాసం(ఆశ్వయుజం)లోని శ్రవణా నక్షత్రం నాటికి పూర్తయ్యేలా బ్రహ్మదేవుడు తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాల(Tirumala Brahmotsavam)ను నిర్వహించార‌ట‌. అందువల్లే అవి బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి చెంది ఆనాటి నుంచి నిరాటంకంగా కొనసాగుతున్నాయి. అయితే ఈ ఏడాది అధికమాసం కారణంగా భాద్రపదంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, దసరా నవరాత్రి బ్రహ్మోత్సవాలు వచ్చాయి. ఈ రెండు బ్రహ్మోత్సవాలకు పెద్ద తేడా లేదు గానీ, నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, ధ్వజావరోహణం ఉండవని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.

TTD Tirumala Navarathri Brahmotsavam Dates 2023 : ఇప్పటికే సెప్టెంబరు 18 నుంచి 26వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను నిర్వహించిన టీటీడీ.. అక్టోబరు 15 నుంచి 23వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయని పేర్కొంది. అందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్​ను విడుదల చేసింది. నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏ రోజు ఏ పూజా కార్యక్రమం జరగనుందో ఇప్పుడు చూద్దాం..

TTD Tirumala Seva Tickets for December : డిసెంబర్​లో తిరుమల వెళ్లే వారికి గుడ్​న్యూస్​.. శ్రీవారి సేవా టికెట్ల షెడ్యూల్ విడుదల.!

తిరుమల శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల షెడ్యూల్ 2023 వివరాలిలా..

Tirumala Navarathri Brahmotsavam Schedule 2023 :

  • అక్టోబర్ 15 ఆదివారం నాడు రాత్రి 7 నుంచి 9 వరకు శ్రీవారు పెద్ద శేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. దీంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి.
  • అక్టోబర్ 16 సోమవారం రెండో రోజు ఉదయం 8 నుంచి 10 వరకు చిన్న శేష వాహనం, రాత్రి 7 నుంచి 9 వరకు హంస వాహనం.
  • అక్టోబర్ 17 మంగళవారం మూడో రోజు ఉదయం 8 నుంచి 10 వరకు సింహ వాహనం, రాత్రి 7 నుంచి 9 వరకు ముత్యపు పందిరి.
  • అక్టోబర్ 18 బుధవారం నాలుగో రోజు ఉదయం 8 నుంచి 10 వరకు కల్ప వృక్ష వాహనం, రాత్రి 7 నుంచి 9 వరకు సర్వ భూపాల వాహనం
  • అక్టోబర్ 19 గురువారం ఐదో రోజు ఉదయం 8 నుంచి 10 వరకు మోహినీ అవతారం, రాత్రి 7 నుంచి 9 వరకు గరుడ వాహన సేవ.
  • అక్టోబర్ 20 శుక్రవారం ఆరో రోజు ఉదయం 8 నుంచి 10 వరకు హనుమద్ వాహనం, పుష్పక విమానం(సాయంత్రం 04:00 PM నుంచి), ఆ తర్వాత గజ వాహనం
  • అక్టోబర్ 21 శనివారం ఏడో రోజు ఉదయం 8 నుంచి 10 వరకు సూర్యప్రభ వాహనం, రాత్రి 7 నుంచి 9 వరకు చంద్రప్రభ వాహనం
  • అక్టోబర్ 22 ఆదివారం ఎనిమిదో రోజు ఉదయం 8 నుంచి 10 వరకు స్వర్ణ రథం (స్వర్ణ రథోత్సవం), రాత్రి 7 నుంచి 9 వరకు అశ్వ వాహనం
  • అక్టోబర్ 23 సోమవారం తొమ్మిదో రోజు(చివరి రోజు) అఖిలాండ నాయకుడికి చక్ర స్నానం నిర్వహించడంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆ సేవలు బంద్.. నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా అక్టోబరు 15 నుంచి 23 వరకు అష్టదళ పాదపద్మారాధన, తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. అయితే ముందస్తుగా ఆర్జిత బ్రహ్మోత్సవం సేవా టికెట్లు బుక్‌ చేసుకున్న భక్తులను నిర్దేశిత వాహన సేవకు అనుమతిస్తారు. అలాగే నవరాత్రి బ్రహ్మోత్సవాల అంకురార్పణ కారణంగా అక్టోబరు 14న సహస్ర దీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది.

Tirumala Darshanam : తిరుమల భక్తులకు షాక్​.. రద్దు నిర్ణయం తీసుకున్న టీటీడీ​..!

IRCTC Hyderabad to Tirupati Tour : హైదరాబాద్ To తిరుపతి.. హ్యాపీగా శ్రీనివాసుడి దర్శనం.. టికెట్ ఎంతో తెలుసా?

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.