TTD Tirumala Seva Tickets for January 2024 : తిరుమలలో కొలువైన వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు ప్రపంచ నలుమూలల నుంచి తరలి వస్తుంటారు. జీవితంలో ఒక్కసారైనా స్వామి వారి దర్శన భాగ్యం కలగాలని ఎంతో మంది కోరుకుంటారు. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు కాలి నడక మార్గం ద్వారా ఏడుకొండలు ఎక్కి తమ మొక్కులను చెల్లించుకుంటారు. స్వామి వారిని దర్శనం చేసుకున్న ఆ క్షణంలో.. తాము ఇంత వరకు ఎంతో శ్రమతో కొండపైకి వచ్చిన బాధలన్నింటినీ భక్తులు మర్చిపోతారు. అది శ్రీ వేంకటేశ్వరుని మహిమగా భక్తులు భావిస్తారు.
Tirumala Rs.300 Special Darshan Tickets : అయితే.. కొత్త సంవత్సరంలో స్వామి వారిని దర్శనం చేసుకుని తమకు సంవత్సరం అంతా శుభం కలగాలని చాలా మంది భక్తులు జనవరిలో కొండ పైకి వెళతారు. అలా వెళ్లాలనుకునే వారికి తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. జనవరి నెలకు సంబంధించి టీటీడీ ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశం దర్శనం, వసతి గదుల కోటాకు సంబంధిచి షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఆ వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఆర్జిత సేవల ఆన్‌లైన్ లక్కీడిప్..
TTD Rs.300 Special Darshan Tickets : తిరుమల తిరుపతి దేవస్థానం సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్‌లైన్ లక్కీడిప్ కోసం అక్టోబర్ 18న.. అంటే ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చని తెలిపింది. ఈ లక్కీడిప్‌లో టికెట్లు పొందిన భక్తులు.. అక్టోబర్ 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు రుసుమును చెల్లించి టికెట్లను ఖరారు చేసుకోవాలని టీటీడీ పేర్కొంది. ఇక.. కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకారణ సేవ టికెట్లను అక్టోబర్ 21వ తేదీన ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేస్తుంది. వర్చువల్ సేవా టోకెన్‌లను అక్టోబర్ 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.
ప్రత్యేక ప్రవేశ దర్శనం.. ఆంగప్రదక్షిణ కోటా టికెట్లు..
జనవరి నెలకు సంబంధించిన ఆంగప్రదక్షిణం టోకెన్ల కోటాను కూడా టీటీడీ విడుదల చేయనుంది. వీటిని అక్టోబర్ 23వ తేదీన ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం, గదుల కోటాకు సంబంధించి అక్టోబర్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. వృద్ధులు, దివ్యాంగుల కోసం దర్శన టోకెన్ల కోటాను అక్టోబర్ 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. భక్తుల కోసం ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్ల కోటాను అక్టోబర్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. తిరుమల, తిరుపతిలో వసతి గదుల బుకింగ్ కోసం అక్టోబర్ 25వ తేదీన ఉదయం 10 గంటలకు టికెట్లు విడుదల చేస్తారు.
Muthyapu Pandiri Vahanam: ముత్యాల పందిరి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీనివాసుడు