TSPSC Paper Leakage Update : టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. మరో వారం రోజుల్లో ఈ కేసుకు సంబంధించి అభియోగపత్రం దాఖలు చేసేలా సిట్ అధికారులు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. 37మందిని నిందితులుగా చేరుస్తూ సిట్ అధికారులు అభియోగపత్రం సిద్ధం చేస్తున్నారు. న్యాయ నిపుణుల సలహా తీసుకొని, ఆ తర్వాత వెంటనే నాంపల్లి కోర్టులో అభియోగపత్రం దాఖలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 50మందిని అరెస్ట్ చేసినా.. అభియోగపత్రంలో 37మందిని నిందితులుగా చేర్చనున్నారు. అందులో ప్రశాంత్ రెడ్డి మినహా, మిగతా నిందితులందరినీ సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు.
SIT Preliminary Charge Sheet TSPSC Leakage : ప్రశాంత్ రెడ్డి మాత్రం న్యూజిలాండ్‌లో ఉండటంతో, సిట్ అధికారులు లుక్ ఔట్ సర్క్యులర్ జారీ చేశారు. అవసరమైతే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసే యోచనలో అధికారులున్నారు. 37మందిలో 15మంది బెయిల్ పై బయటికి వచ్చారు. ప్రధాన నిందితుడు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డితో పాటు మిగతా నిందితులు జ్యూడీషియల్ ఖైదీలుగా ఉన్నారు. ఇదే కేసులో గత వారం సిట్ అధికారులు అరెస్ట్ చేసిన పూల రమేష్ ను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. డీఈ పూల రమేశ్ ప్రశ్నపత్రాల లీకేజీతో పాటు హైటెక్ మాస్ కాపీయింగ్ చేయించినట్లు ప్రాథమికంగా తేల్చారు. టీఎస్‌పీఎస్సీ మాజీ ఉద్యోగి సురేశ్ ద్వారా ఏఈ ప్రశ్నపత్రం పొందిన పూల రమేశ్.. దాదాపు 80మందికి విక్రయించినట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. అరెస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మార్చి 11వ తేదీన బేగంబజార్ పోలీస్ స్టేషన్ లో ప్రశ్నాపత్రాల లీకేజీ కేసు నమోదైంది. దాదాపు మూడు నెలలు కావస్తుండటంతో వీలైనంత తొందర అభియోగపత్రం దాఖలు చేయాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. మిగతా నిందితుల పేర్లను అనుబంధ అభియోగపత్రంలో నమోదు చేయనున్నారు.
- Accused used chat GPT to cheat in TSPSC Exams : టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్.. చాట్ జీపీటీతో ఏఈఈ పరీక్ష
బయటపడుతున్న పూల రమేశ్ అక్రమాలు : టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో తవ్వే కొద్దీ డొంక కదులుతోంది. సిట్ దర్యాప్తులో పట్టుబడిన డీఈ పూల రమేశ్ లీలలు అన్నీ ఇన్నీ కావు. ఏకంగా జనవరి, ఫిబ్రవరిలో జరిగిన ఏఈఈ, డీఏఓ పరీక్ష రాసిన నిందితులు సాంకేతిక పరిజ్ఞాపం ఉపయోగించి.. మాస్ కాపీయింగ్‌కు పాల్పడేలా ప్రణాళికను ఇతగాడే రచించాడు. ఇతనికి సాంకేతిక పరిజ్ఞాపంపై అపారమైన పట్టు ఉందని సిట్ అధికారులు దర్యాప్తులో తేల్చారు. ఆ రెండు పరీక్షలను రాసిన మొత్తం 7 మందిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.
TSPSC Paper Leakage SIT Investigation : వారి ఒక్కొక్కరి నుంచి రూ.40 లక్షలు.. కరీంనగర్ జిల్లాలోని ప్రజాప్రతినిధి కుమార్తె పరీక్ష రాస్తే రూ.70 లక్షలు వసూలు చేశాడు. సిట్ అధికారులు ఏఈఈ, డీఏఓ పరీక్షలు రాసిన టాపర్ల వివరాలు సేకరించిప్పుడే.. పూల రమేశ్ చేసిన ఈ బాగోతం బయటపడింది. వీరికి అవసరమైన ఎలక్ట్రానిక్ డివైజ్‌లను తనే స్వయంగా కొనుగోలు చేసినట్లు సిట్ విచారణలో తెలిపాడు. ఈ మాస్ కాపీయింగ్‌లో టోలిచౌకీ కళాశాల ప్రిన్సిపల్ మహ్మద్ పాషాకు రూ. 8లక్షలు ఇచ్చినట్లు ఒప్పుకున్నాడు. దీంతో ఆ ప్రిన్సిపల్‌ను కూడా అరెస్టు చేశారు. ఇతను ఇన్విజిలేటర్‌గా విధులు నిర్వర్తించి.. కాపీయింగ్‌కు పూర్తి సహకారం అందించినట్లు అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి :