TSPSC Paper Leak Case Update : టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాలు లీకైనప్పటి నుంచి ఇప్పటి వరకు కమిషన్ నిర్వహించిన మూడు పరీక్షలకు ఇప్పుడు ఆటంకం తప్పడం లేదు. ఆ పరీక్షలు రాసి తుది ఫలితాల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగార్థులు ఇంకా కొన్నాళ్లు వేచి ఉండక తప్పదు. ఎందుకంటే కేసును సిట్ దర్యాప్తు చేస్తున్న సందర్భంగా.. ఈ సమయంలో ఫలితాలు వెల్లడించడం.. తుది ఎంపిక చేపట్టడం న్యాయసూత్రాలకు విరుద్ధమని టీఎస్పీఎస్సీ కమిషన్ భావిస్తోంది. ఇందుకు సాంకేతిక, న్యాయ ఇబ్బందులూ తలెత్తే అవకాశం కూడా ఉండవచ్చని అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే వరకు వేచి ఉండాలని టీఎస్పీఎస్సీ భావిస్తోంది. అసలు నిందితులు ఏఏ ప్రశ్నపత్రాలు లీక్ చేశారు? వాటిని ఎంత మందికి కొనుగోలు చేశారనే విషయంపై సిట్ దర్యాప్తును చేస్తోంది.
TSPSC delayed Exam results due to Paper leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకు ముందు గతేడాది జూలైలో ఐపీఎంలో 24 పోస్టులకు సంబంధించి కమిషన్ ప్రకటనను విడుదల చేసింది. ఆ తర్వాత 16,381 మంది ఉద్యోగార్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. వారికి అదే ఏడాది నవంబరులో రాత పరీక్షను నిర్వహించారు. డిసెంబరులో మెరిట్ జాబితాను కూడా ప్రకటించారు. ఈ పోస్టులకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేస్తామని టీఎస్పీఎస్సీ కూడా ప్రకటించింది. ఆ తర్వాత జరిగిన అనూహ్య కారణాల వల్ల గ్రూప్-1 పోస్టుల భర్తీలో మహిళలకు పురుషులతో పాటు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని గ్రూప్‌నకు ప్రిపేర్ అయ్యే మహిళా అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.
అందుకు హైకోర్టు వెంటనే గ్రూప్-1లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని కమిషన్‌ను ఆదేశించింది. అదే విధంగా పోలీసు శాఖలోనూ మొదటి నుంచి ఇదే విధానం అమలవుతున్నందున అన్ని నియామకాల్లోనూ ఇదే పద్ధతిని పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఇంత జాప్యం ఉండడంతో ఐపీఎం పోస్టుల ఫలితాలు ఆలస్యం. ఇప్పుడు టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసుతో వీటి తుది జాబితా ప్రకటన మరింత ఆలస్యం అవుతుందని కమిషన్ వెల్లడించింది.
SIT Investigation in TSPSC Paper Leak : మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉన్న ఈ పోస్టులకు సంబంధించి గతేడాది ఆగస్టు, సెప్టెంబరులోనే కమిషన్ రెండు ఉద్యోగ ప్రకటనలను విడుదల చేసింది. ఈ పోస్టులకు ఈ ఏడాది జనవరిలో పరీక్షలు నిర్వహించారు. ఈ విభాగంలో 23 సీడీపీవో, శిశు సంక్షేమాధికారుల పోస్టులకు 19,184 మంది, 181 గ్రేడ్-1 విస్తరణ అధికారుల పోస్టులకు 26,752 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పోస్టులకు సంబంధించిన పరీక్షకు ప్రాథమిక కీ కూడా విడుదలైయింది. తుది కీ జారీ చేసి.. ఇంకా మెరిట్ జాబితాను ప్రకటించాల్సి విషయమే ఆఖరు.
వీలైనంత త్వరగా సీబీఆర్‌టీ పరీక్షల ఫలితాలు : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ తర్వాత కమిషన్.. మిగిలిన పరీక్షలను, రీషెడ్యూలు అయిన పరీక్షలకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (సీబీఆర్‌టీ) నిర్వహిస్తున్నారు. పరీక్షల్లో పారదర్శకతతో పాటు.. ఫలితాలను వేగంగా వెల్లడించేందుకు కసరత్తు చేస్తున్నారు. సిట్ దర్యాప్తుతో సంబంధం లేని రాత పరీక్షలకు సీబీఆర్‌టీ పరీక్షలు పూర్తి అయిన నెల నుంచి 45 రోజుల్లోగా మెరిట్ జాబితాను సిద్ధం చేసేలా చర్యలు తీసుకోనున్నారు. అంతే వేగంగా 1:2 నిష్పత్తిలో ఎంపిక చేసి.. తుది జాబితాను వేగంగా ఇవ్వనున్నారు.
ఇవీ చదవండి :