త్రిపురలో కాషాయం జోరు కొనసాగుతోంది. అధికారం నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తోంది. గురువారం ఉదయం 8 గంటలకు మొదలైన కౌంటింగ్‌లో ముందు నుంచే అధిక్యాన్ని కొనసాగిస్తోంది. ఒకనొక దశలో ప్రాంతీయ తిప్రా మోతా పార్టీ కింగ్‌మేకర్ అవతరించేలా కనిపించినా.. ఆ తర్వాత అధిక్యం కోల్పోయింది. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీని బీజేపీ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.
త్రిపురలో ఎలాగైనా ఖాతా తెరచి తన ప్రతిష్ఠను కొంతైనా కాపాడుకోవాలని వామపక్షాలతో జట్టుకట్టిన కాంగ్రెస్ మరోసారి షాక్ తగిలింగి. ఆ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. సీపీఐ(ఎమ్)తో కలిసి 13 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసింది. రెండో స్థానం కోసం వామపక్షాల కూటమికి తిప్రా మోతా గట్టి పోటీ ఇస్తోంది.
కొనసాగుతున్న లెక్కింపు..
మూడు ఈశాన్య రాష్ట్రాలు త్రిపుర, నాగాలాండ్, మేఘాలయల్లో జరిగిన ఎన్నికలకు గురువారం(మార్చి 2)న లెక్కింపు జరిగింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఓట్ల లెక్కంపులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. 25, 000 మంతి భద్రతా సిబ్బందిని మోహరించారు. ఇక మార్చి 1 సాయంత్రం 6 గంటల నుంచి మార్చి 3 సాయంత్రం 6 గంటల దాగా 144 సెక్షన్‌ను అమలులో ఉంచారు. కాగా, అత్యవసర సేవలను దీని నుంచి మినహాయింపునిచ్చారు. ఇక, ఫిబ్రవరి 16న త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అందులో 60 స్థానాలకు 259 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. మొత్తం 28.12 లక్షల ఓటర్లలో 89.98 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
2018లో ఇలా..
2018 ఎన్నికల్లో బీజేపీ 36 స్థానాల్లో విజయం సాధించింది. ఇక దాని మిత్ర పక్షం ఐపీఎప్టీ 18 సీట్లు గెలిచింది. సీపీఐ 16 సీట్లు సాధించింది. ఇక కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవలేకపోయింది.