Triplets Sisters Won Silver In National Taekwondo : ఒకే కాన్పులో జన్మించిన ఈ ముగ్గురు అమ్మాయిలు జాతీయ స్థాయి తైక్వాండో పోటీలో సత్తా చాటారు. జూనియర్ విభాగంలో ఈ ముగ్గురు రజత పతకాలు సాధించారు. బంగాల్లోని ఆసన్సోల్కు చెందిన సుచేత, రంజిత, సుపీత్ర ప్రస్తుతం ఏడో తరగతి చదువుతున్నారు. డిసెంబర్లో ఉత్తరాఖండ్‌లోని దెహ్రాదూన్‌లో జరిగిన జాతీయ స్థాయి తైక్వాండో పోటీలో పాల్గొన్నారు. జూనియర్ స్థాయి బాలికల విభాగంలో జట్టుగా పాల్గొన్న వీరు ముగ్గురు రజతం గెలుచుకున్నారు.
"తైక్వాండో పాటు డ్యాన్స్, సింగింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తుంటాం. తైక్వాండ్ జాతీయ స్థాయి పోటీలో గత ఏడాది కాంస్యం గెలుచున్నాం. ఈ సంవత్సరం రజతం సాధించాం. మేము ఇందులో స్వర్ణం గెలిచి అంతర్జాతీయ పోటీలో పాల్గొనాలని లక్ష్యంగా పెట్టుకున్నాం."
- సుప్రీత
'అప్పుడు చాలా మాటలు పడ్డాం- ఇప్పుడు గర్వపడుతున్నాం'
12 ఏళ్ల వయసులోనే తమ కుమార్తెలు జాతీయ స్థాయిలో పతకాలు సాధించినందుకు తల్లిదండ్రులు గర్వపడుతున్నారు. "ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చినందుకు సమాజంలో చాలా మాటాలు పడాల్సి వచ్చింది. కానీ ఈ రోజు నా ముగ్గురు కూతుళ్లు ఆ అవమానాలన్నింటికి సమాధానం చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని నేను కోరుకుంటున్నాను" అని బాలికల తల్లి సునేత్ర దేవి ఛటోపాధ్యాయ తెలిపారు. తన కుమార్తెల విజయం పట్ల తండ్రి బామా ప్రసాద్ ఛటోపాధ్యాయ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే, అంతర్జాతీయ తైక్వాండో పోటీల్లో పాల్గొనాలంటే ఖర్చు ఎక్కువ అవుతుందని ఆందోళన చెందుతున్నారు.
"అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడి విజయం సాధించాలని నేను కోరుకుంటున్నాను. నా పిల్లలు చాలా కష్టపడుతున్నారు. రోజుకు నాలుగు గంటలు పాటు ప్రాక్టీస్ చేస్తారు. భవిష్యత్తులో ఈ గేమ్ ఆడటానికి, ఆహారం, దుస్తులు, ప్రయాణ, ఇతర ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అదే నాకు ఆందోళనగా ఉంది."
- బామాప్రసాద్ ఛటోపాధ్యాయ, బాలికల తండ్రి
భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయి పోటీలో పాల్గొనడానికి తమ కుమార్తెలకు ప్రభుత్వం లేదా ఏదైనా స్వచ్ఛంద సంస్థలు సహాయం చేస్తే బాగుటుందని బాలికల తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.
కవలలే కానీ చాలా తేడా..! ఈ అక్కాచెల్లెళ్లకు గిన్నిస్ రికార్డులో చోటు
తల్లి గర్భంలో కేవలం 150 రోజులే.. ఆ స్పెషాలిటీతోనే ముగ్గురు చిన్నారులు గిన్నిస్ రికార్డు!