తమిళనాడు తిరుచ్చిలోని కర్ణన్ హోటల్ యజమాని.. రజినీకాంత్‌పై అభిమానాన్ని వినూత్నంగా చాటుకుంటున్నారు. అన్నాత్తె సినిమా విడుదల(annaathe release) సందర్భంగా ఒక రూపాయికే దోశను(Dosa recipe) అందిస్తున్నారు.
అన్నాత్తె సినిమా(rajinikanth new movie) సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ తన హోటల్‌కు వచ్చే కస్టమర్లకు కర్ణన్ రూపాయికే దోశను అందిస్తున్నారు. థియేటర్లకు ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని, సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నట్లు కర్ణన్ తెలిపారు.
థియేటర్ల వద్ద బారులు..
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నాత్తె సినిమా విడుదల సందర్భంగా.. చెన్నైలోని థియేటర్లకు అభిమానులు పోటెత్తారు. రజినీ సినిమాను తొలిరోజు మొదటి ఆటలోనే చూడాలనే ఉత్సాహంతో థియేటర్ల వద్ద తెల్లవారుజామునుంచే బారులు తీరారు. సినిమా హాళ్ల ఎదుట డప్పులు వాయిస్తూ నృత్యాలు చేస్తూ సూపర్‌స్టార్‌పై తమ అభిమానాన్ని చాటుకున్నారు.
![Annaatthe release news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13543915_annaathe.jpg)
![Annaatthe release news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13543915_annaathe1.jpg)
ఇదీ చూడండి: రిలీజ్‌కు ముందే రజనీ 'అన్నాత్తే' రికార్డు