Trains Cancelled Due To Cyclone Michaung : మిగ్ జాం తుపాన్ ప్రభావంతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. మరికొన్ని రైళ్లను దారి మళ్లించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా 305 రైళ్లను రద్దు చేసినట్లు వెల్లడించారు. ఈ నెల 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఈ రైళ్ల రద్దు ఉంటుందని తెలిపారు. వాతావరణం అనుకూలిస్తే తిరిగి పునరుద్ధరించనున్నట్లు స్పష్టం చేశారు.
Cyclone Michaung on Telangana : ఈ నెల 4న 101 రైళ్లు, 5వ తేదీన 89 రైళ్లను, 6వ తేదీన 38 రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. వీటితో పాటు 11 రైళ్లను దారి మళ్లించినట్లు, మరో 11 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు తెలిపింది. మిగ్ జాం తుపాన్ నేపథ్యంలో జీఎం అరుణ్ కుమార్ రైల్ నిలయంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. విజయవాడ, గుంతకల్, గుంటూరు, సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ తదితర ఆరు డివిజన్ల డీఆర్ఎంలతో దృశ్యమాధ్యమ సమీక్ష జరిపారు. తుపాన్ నేపథ్యంలో రైల్వే తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు.
తెలంగాణపై మిగ్జాం ఎఫెక్ట్ - ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్
ట్రాక్, రైల్వే కార్యకలాపాల భద్రతను నిర్ధారించడానికి సెక్షన్‌లోని రైల్వే ప్రభావితం చేసే ట్యాంక్‌ల స్థానాన్ని పర్యవేక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఎన్.డీ.ఆర్.ఎఫ్ బృందాలను సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రభావిత ప్రాంతాల్లో ట్రాక్‌లపై మాన్‌సూన్ పెట్రోలింగ్ ఉండేలా చూడాలన్నారు. తుపాన్ ప్రభావిత రోడ్డు అండర్ బ్రిడ్జిల స్థానాలను నిశితంగా పరిశీలిస్తున్నామని, అవసరమైతే మూసి వేయవచ్చని, నీటిని పంపింగ్ చేయడానికి ఏర్పాట్లు చేసినట్లు అధికారులు జీఎంకు వివరించారు. ఏమైనా పునరుద్ధరణ చర్యలు తక్కువ సమయంలో చేపట్టేందుకు ఇసుక సంచులు, బ్యాలస్ట్ నిల్వ చేసి ఉంచినట్లు అధికారులు తెలిపారు.
మిగ్జాం బీభత్సం- భారీ వర్షాలకు 8 మంది మృతి, స్కూళ్లు బంద్
రద్దయిన రైళ్ల వివరాలు:
- మద్రాస్ - ముంబయి
- తిరుపతి - మద్రాస్
- గూడూరు - రేణిగుంట
- హౌరా - తిరుచినపల్లి
- నెల్లూరు - సుల్లూరుపేట
- మధురై - దిల్లీ
- ఎర్నాకులం - పాట్నా
- విశాఖపట్టణం - తిరుపతి
- సుల్లూరిపేట - నెల్లూరు
- చెన్నై సెంట్రల్ - ముంబయి ఎల్.టి.టి
- చెన్నై సెంట్రల్ - బిట్రగుంట
- చెన్నై సెంట్రల్ - తిరుపతి
- తిరుచిరపల్లి - హౌరా
- కోయంబత్తూర్ - బరౌని
- గూడూరు - రేణిగుంట
- తిరుపతి - పుల్లా
- తిరుపతి - పూర్ణ,
- తిరుపతి - ఎంజీఆర్ చెన్నై సెంట్రల్
దారి మళ్లించిన రైళ్ల వివరాలు:
- హౌరా - కన్యాకుమారి
- ముంబయి సీఎస్‌ఎంటీ - ఎంజీఆర్ చెన్నయ్ సెంట్రల్
ఆ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు: ఇదిలా ఉండగా తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో నేడు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది.
ఉత్తర దిశగా కదులుతున్న తీవ్రతుపాను - కొంతభాగం సముద్రంలో ఉన్నట్లు ఐఎండీ వెల్లడి