Traffic Champ Campaign: ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచేందుకు, రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు 'ట్రాఫిక్ ఛాంప్' పేరుతో వినూత్న కార్యక్రమాన్ని తీసుకొచ్చింది గుజరాత్ సర్కార్. ఈ కార్యక్రమంలో భాగంగా.. వడోదరాలో ట్రాఫిక్ రూల్స్‌ను పాటించినవారికి రూ.100 పెట్రోల్ ఉచితంగా అందిస్తోంది.
ట్రాఫిక్ ఆంక్షలు, నిబంధనలను విధిగా పాటించిన వారిలో రోజూ 50 మందిని ఎంపిక చేసి.. వారికి ఉచితంగా పెట్రోల్, డీజిల్ కూపన్స్ అందిస్తున్నట్లు వడోదరా పోలీస్ కమిషనర్ షంషేర్ సింగ్ తెలిపారు. వీటితో పాటు రెస్టారెంట్ కూపన్స్ సైతం అందిస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర హోంమంత్రి హర్షా సంఘ్వీ ప్రారంభించిన ఈ కార్యక్రమం.. ఏడాదిపాటు కొనసాగుతుందన్నారు.
ట్రాఫిక్ రూల్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించడం, రోడ్డు ప్రమాదాలు, కాలుష్యాన్ని నివారించడం కోసం ఈ వినూత్న కార్యక్రమాన్ని తీసుకొచ్చామని సీపీ తెలిపారు.
ఇదీ చూడండి: కరోనా టీకా తీసుకోనివారికి వారం రోజుల డెడ్‌లైన్