రైతు నిరసనల టూల్కిట్ వ్యవహారంలో అరెస్టయిన పర్యావరణ కార్యకర్త దిశ రవికి.. ఒక్కరోజు పోలీస్ కస్టడీ విధించింది దిల్లీ మెట్రో పాలిటన్ కోర్టు. సహ నిందితులు నికితా జాకబ్, శంతనుతో కలిపి ఆమెను విచారించేందుకు సమయం కావాలని పోలీసులు కోరగా కోర్టు అంగీకరించింది.
అంతకుముందు పటియాలా హౌస్ కోర్టు దిశ రవికి మూడు రోజులు జుడీషియల్ కస్టడీ విధించింది. ఆ గడువు అయిపోయినందు వల్ల పోలీసులు ఆమెను సోమవారం కోర్టు ముందు హాజరుపరిచారు.
జనవరి 26న రైతుల ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి సంబంధించి ఓ కార్యాచరణను ఈ టూల్‌కిట్‌లో పొందుపర్చారనే ఆరోపణలతో దిశా రవిని ఫిబ్రవరి 13 న పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేశారు.
ఇదీ చదవండి : టూల్కిట్ కేసు: మూడు రోజుల కస్టడీకి దిశ రవి
ఇదీ చదవండి : టూల్కిట్ కేసులో నికిత, శంతను విచారణ