ఒడిశాలోని పూరీకి చెందిన విశ్వజిత్ నాయక్ చేతులు అద్భుతాన్ని చేశాయి. ఐస్క్రీమ్ పుల్లల సాయంతో టోక్యో ఒలింపిక్స్ స్టేడియం మినియేచర్ను రూపొందించి వారెవ్వా అనిపించాడు. 375 ఐస్ క్రీమ్ పుల్లలను ఉపయోగించి కేవలం నాలుగు రోజుల్లోనే ఈ సూక్ష్మ కళాఖండాన్ని రూపొందించడం విశేషం.
ఈ కళాఖండాన్ని ఒలింపిక్స్లో పాల్గొన్న భారత అథ్లెట్లకు అంకితం చేశాడు విశ్వజిత్. క్రీడల్లో పాల్గొన్న వారికి అభినందనలు తెలిపాడు.
రథయాత్ర సమయంలోను విశ్వజిత్.. జగన్నాథుని గజానన బేష రూపాన్ని తయారు చేశాడు. 1475 ఐస్క్రీమ్ పుల్లలతో దీన్ని రూపొందించినట్లు పేర్కొన్నాడు. ఈ కళాఖండం రూపకల్పనలకు పలువురి ప్రశంసలు పొందుతున్నాడు.
ఇదీ చదవండి:'జగన్నాథుడి'పై కళాకృతులు.. ప్రపంచంలోనే అతిపెద్ద సైకత శిల్పం