నేటి రాశిఫలాల గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ చెప్పిన సంగతులు మీకోసం..
మేషం
ముఖ్య విషయాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. అనవసర ఖర్చులను అదుపు చేయండి. లక్ష్మీధ్యానం శుభప్రదం.
వృషభం
ప్రణాళికలను అమలు చేసే దిశగా ముందుకు సాగండి. బలమైన ఆహారాన్ని తీసుకోవాలి. శత్రువుల జోలికి పోరాదు. వృథా ప్రయాణాల వల్ల నిరుత్సాహం కలుగుతుంది. దుర్గారాధన వల్ల మేలు జరుగుతుంది.
మిథునం
కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. జన్మరాశిలో చంద్రుడు అనుకూల ఫలితాలను ఇస్తున్నారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఇష్టదేవతా స్తుతి మంచిది.
కర్కాటకం
కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. పొదుపు పాటించాలి. స్థానచలనం సూచితం. కీలక వ్యవహారాల్లో ఓర్పుగా వ్యవహరించండి. శివనామాన్ని జపించాలి.
సింహం
విజయావకాశాలు మెరుగవుతాయి. శత్రువులపై మీదే పైచేయి అవుతుంది. ఆర్థిక వ్యవహారాలలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇష్టదైవ నామస్మరణ మంచిది.
కన్య
మానసికంగా దృఢంగా ఉంటారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మీ పట్ల అధికారుల వైఖరి మిశ్రమంగా ఉంటుంది. ఆంజనేయ దర్శనం మంచిది.
తుల
ఉద్యోగంలో పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులు మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. మీ నిజాయతీ మిమ్మల్ని కాపాడుతుంది. శివనామాన్ని జపించాలి.
వృశ్చికం
అవసరానికి తగిన సహాయం అందుతుంది. మనోబలంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. బంధుమిత్రులతో కలిసి కీలక నిర్ణ్రయాలు తీసుకుంటారు. భోజన సౌఖ్యం కలదు. ఇష్టదైవారాధన శుభప్రదం.
ధనుస్సు
అవసరానికి తగిన సహకారం అందుతుంది. బాధ్యతలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగితే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. మీ సొంత విషయాలపై ఇతరుల ప్రభావం లేకుండా చూసుకోవాలి. శ్రీ విష్ణు ఆరాధన మంచిది.
మకరం
చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. కీలక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. ఆదిత్య హృదయం చదవడం ఉత్తమం.
కుంభం
చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. కీలక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. ఆదిత్య హృదయం చదవడం ఉత్తమం.
మీనం
ఒక శుభవార్త వింటారు. ఒక వ్యవహారంలో మీకు సహాయం అందుతుంది. కీలక విషయాల్లో చురుగ్గా పనిచేస్తారు. మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ముఖ్య విషయాల్లో నిర్లక్ష్యం చేయకండి. శివ స్తోత్రం చదివితే బాగుంటుంది.
ఇదీ చూడండి: 'నాలుగేళ్లలో ఆయుష్మాన్ భారత్కు 7% నిధులే'