తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో(tn local body election results 2021) ఓ భాజపా అభ్యర్థికి గెట్టి ఎదురుదెబ్బ తలిగింది. ఆయనకు ఒక్కటంటే.. ఒక్కటే ఓటు దక్కింది(bjp tamil nadu news). ఆయన కుటుంబంలో ఐదుగురు సభ్యులు ఉన్నా ఒక్క ఓటే పడటం వల్ల ఈ వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఈ నెల 6,9 తేదీల్లో తమిళనాడులో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. మొత్తం 27,003 వార్డుల నుంచి 79,433 మంది పోటీపడ్డారు. అందులో డి.కార్తిక్ ఒకరు. కోయంబత్తూర్ జిల్లాలోని పెరియనైకెంపాలెం నుంచి వార్డు సభ్యుడిగా భాజపా టికెట్‌పై పోటీచేశారు. ఆయన కుటుంబసభ్యుల్లో ఐదుగురికి ఓటు హక్కు ఉంది. చివరకు ఎన్నికల ఫలితాలు రాగా.. కేవలం ఒక్క ఓటే ఆయనకు పడిందని తేలింది.
ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వ్యవహారంపై ట్విట్టర్లో కొందరు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
"స్థానిక ఎన్నికల్లో భాజపా అభ్యర్థికి ఒక్క ఓటే వచ్చింది. ఆయనకు కాకుండా.. వేరే వారికి ఓటు వేసిన ఆయన కుటుంబసభ్యులను చూస్తే గర్వంగా ఉంది."
-- మీనా కందసామి, రచయిత్రి.
"ఆయన కుటుంబంలో ఐదుగురు ఉన్నారు. కానీ కోయంబత్తూర్‌లో ఆయనకు ఒక్కటే ఓటు పడింది. తమిళనాడులో భాజపా పరిస్థితి ఇంతే."
-- అశోక్ కుమార్, కాంగ్రెస్
ఎన్నికల వేళ కార్తిక్ విడుదల చేసిన పోస్టర్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి అమిత్‌షాతో పాటు మరో ఏడుగురు నేతలున్నారని.. కనీసం 7 ఓట్లు కూడా పడలేదని ఒకరు ట్వీట్ చేశారు.
ఇదీ చూడండి:- భాజపాకు షాక్.. కాంగ్రెస్‌లోకి ఉత్తరాఖండ్ మంత్రి