ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి.. ఆకస్మిక తనిఖీలతో అధికారులకు షాకిస్తుంటారు. అలాగే ప్రజలతో మమేకమై వారి బాధలను తెలుసుకుంటుంటారు. ఇటీవల సీఎం కార్యాలయానికి వెళ్తూ తన కాన్వాయ్‌ని రహదారిపైనే ఆపి.. ఓ వృద్ధురాలి వద్ద దరఖాస్తు తీసుకుని అందరి మనసులు దోచుకున్నారు. తాజాగా రోడ్డుపైనే నవదంపతులను ఆశీర్వదించి.. వారిని ఆశ్చర్యపరిచారు. ఆయనే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్.
ఈ సంఘటన స్టాలిన్ సొంత జిల్లా తిరువరూర్లో జరిగింది. జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రారంభోత్సవానికి వెళ్తున్న స్టాలిన్.. దారిలో ఓ ఫంక్షన్ హాల్ బయట పెళ్లి బట్టల్లో ఉన్న వధూవరులు.. రామ, రాజమణిలను గమనించారు. వెంటనే కారు ఆపి.. వారి వద్దకు వెళ్లి ఆశీర్వదించారు. వారు ఊహించని విధంగా సీఎం రాకతో కొత్త జంట ఒక్కసారి సంభ్రమాశ్చర్యానికి గురైంది.
ఇదీ చూడండి: సీఎం సైకిల్‌పై వచ్చి సర్ప్రైజ్ చేస్తే...