ETV Bharat / bharat

నారదా కుంభకోణం: మంత్రుల బెయిల్​పై స్టే-జైలుకు తరలింపు

WB MINISTERS BREAKING
బంగాల్​లో ముగ్గురు మంత్రులను అదుపులోకి తీసుకున్న సీబీఐ
author img

By

Published : May 17, 2021, 9:48 AM IST

Updated : May 18, 2021, 3:08 AM IST

02:57 May 18

  • TMC leaders Firhad Hakim, Subrata Mukherjee, Madan Mitra and Sovhan Chatterjee leave from CBI office as they are being taken to Presidency Jail pic.twitter.com/N9bb9qkSOo

    — ANI (@ANI) May 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

నలుగురు నేతలను ప్రెసిడెన్సీ జైలుకు తరలించారు అధికారులు.

23:57 May 17

బెయిల్‌ ఉత్తర్వులను నిలిపివేసిన కోల్‌కతా హైకోర్టు

నారదా కుంభకోణంలో నలుగురు నేతల బెయిల్ నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కోల్​కతా హైకోర్టు. తదుపరి విచారణ బుధవారానికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో నలుగురు నేతలను త్వరలోనే ప్రెసిడెన్సీ జైలుకు తరలించనున్నారు పోలీసులు. 

19:06 May 17

ఆ నలుగురికి బెయిల్​..

నారదా కుంభకోణం కేసులో అరెస్టయిన ఇద్దరు బంగాల్​ మంత్రులు ఫిర్హాద్​ హకీం, సుబ్రతా ముఖర్జీ, ఓ ఎమ్మెల్యే మదన్​ మిత్రా, మాజీ మంత్రి సోవన్​ ఛటర్జీలకు బెయిల్​ లభించింది. సీబీఐ కస్టడీకి కోరగా.. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జడ్జి బెయిల్​కు అంగీకరించారు. 

18:47 May 17

అరెస్టులు.. ఆందోళనలు.. 

నారదా కుంభకోణం కేసులో బంగాల్​ మంత్రి మండలిలో ఇద్దరు సభ్యులు సహా ఒక మాజీ మంత్రిని, ఒక ఎమ్మెల్యేను కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) అధికారులు అరెస్టు చేశారు. 2016లో కలకలం రేగిన నారదా కుంభకోణంపై సీబీఐ.. ఈ అరెస్టులతో జోరు పెంచింది. ఈ ఉదయం.. కేంద్ర బలగాలతో బంగాల్‌ రవాణా మంత్రి హకీం నివాసానికి చేరుకున్న సీబీఐ బృందం ఆయనను తమ కార్యాలయానికి తరలించింది. ఆ తర్వాత టీఎంసీ ప్రజాప్రతినిధులను అరెస్టు చేసినట్లు ప్రకటించింది. ఈ వ్యవహారాన్ని కోర్టులో తేల్చుకోనున్నట్లు హకీం తెలిపారు. 

టీఎంసీ శ్రేణుల ఆందోళన..

ఈ అరెస్టులకు వ్యతిరేకంగా టీఎంసీ శ్రేణులు నిజాం ప్యాలెస్​ వద్దనున్న సీబీఐ ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళనకు దిగాయి. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా సీబీఐ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. ఓ పద్ధతి లేకుండా తమ మంత్రులను అరెస్టు చేసినట్లు ఆరోపించిన మమత.. తనను కూడా అరెస్టు చేయండంటూ మండిపడ్డారు. దాదాపు 6 గంటల తర్వాత అక్కడినుంచి వెనుదిరిగారు. 

తృణమూల్​ మద్దతుదారులు లాక్‌డౌన్‌ ఆంక్షలు పక్కన పెట్టి మరీ రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. సీబీఐ కార్యాలయంపై.. రాళ్లదాడి చేశారు. అనేక చోట్ల రోడ్లపై టైర్లు కాల్చి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేవలం గవర్నర్‌ అనుమతితో.. సీబీఐ అధికారులు ఎమ్మెల్యేలను అరెస్ట్‌ చేయటం అనైతికమని బంగాల్ స్పీకర్ పేర్కొన్నారు. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలపై స్పందించిన గవర్నర్‌ జగదీప్​ ధన్‌కర్‌ పరిస్థితిని వెంటనే అదుపులోకి తేవాలని మమతకు సూచించారు.

16:46 May 17

సీబీఐ కార్యాలయం నుంచి బయటికి వచ్చిన మమత..

నిజాం ప్యాలెస్​లోని సీబీఐ ప్రధాన కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బయటకు వచ్చారు. మంత్రుల అరెస్టును వ్యతిరేకిస్తూ కార్యాలయానికి వెళ్లిన మమత.. 6 గంటలు లోపలే ఉన్నారు. 

నారదా కేసులో ఇద్దరు బంగాల్​ మంత్రులను అరెస్టు చేసింది సీబీఐ. 

15:01 May 17

రాళ్లు రువ్విన ఆందోళనకారులు..

బంగాల్​ సీబీఐ కార్యాలయం ఎదుట ఆందోళనలు నిర్వహిస్తున్న తృణమూల్​ కాంగ్రెస్​ నిరసనకారులు.. భద్రతా బలగాలపై రాళ్లు రువ్వారు. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

13:38 May 17

cbi tmc
టీఎంసీ వర్గాలను నిలువరిస్తున్న బద్రతా సిబ్బంది

ఆందోళన

నారదా కుంభకోణం కేసులో టీఎంసీ మంత్రులు, ఇతర నేతలను సీబీఐ అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తృణమూల్ జెండాలను పట్టుకొని సీబీఐ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

12:20 May 17

2017లోనే కేసు..

నారదా స్టింగ్​ కేసుకు సంబంధించి కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు 2017 ఏప్రిల్​ 16నే వీరిపై సీబీఐ కేసు నమోదు చేసిందని ముఖ్య సమాచార అధికారి ఆర్​సీ జోషి తెలిపారు. ఈ కేసులో ఐదుగురు నిందితులపై సీబీఐ.. అభియోగ పత్రాన్నిదాఖలు చేయనుందని అధికారులు తెలిపారు. 

11:09 May 17

సీబీఐ కార్యాలయానికి చేరుకున్న మమత

బంగాల్​ సీఎం మమతా బెనర్జీ సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. 

10:56 May 17

నారదా స్కామ్: బంగాల్​ మంత్రులను అరెస్ట్​ చేసిన సీబీఐ

నారదా కుంభకోణం కేసులో బంగాల్​ మంత్రులు ఫిర్హాద్‌ హకీం, సుబ్రతా ముఖర్జీ సహా ఎమ్మెల్యే మదన్‌ మిత్రా, మాజీ మేయర్‌ సోవన్‌ ఛటర్జీలను సీబీఐ అరెస్టు చేసింది. త్వరలో ఇందుకు సంబంధించి సీబీఐ ఛార్జ్​ షీట్​ ఫైల్​ చేయనున్నట్లు సమాచారం. 

09:46 May 17

లైవ్​: నారదా స్కామ్

  • West Bengal: TMC MP Kalyan Banerjee (in pics), Former Mayor Sovhan Chatterjee's wife Ratna, and MP Santanu Sen arrive at the CBI office.

    Visuals from Nizam Palace pic.twitter.com/CptrSSEIjp

నారదా గ్రూపు కుంభకోణం వ్యవహారంలో బంగాల్‌కు చెందిన ఇద్దరు మంత్రులను సీబీఐ అదుపులోకి తీసుకుంది. మంత్రులు ఫిర్హాద్‌ హకీం, సుబ్రతా ముఖర్జీతో పాటు ఎమ్మెల్యే మదన్‌ మిత్రా, మాజీ మేయర్‌ సోవన్‌ ఛటర్జీలను సీబీఐ కార్యాలయానికి తరలించింది. వీరితో పాటు తృణమూల్​ ఎంపీలు కల్యాణ్​ బెనర్జీ, సంతను సేన్​ సహా సోవన్​ ఛటర్జీ సతీమణి రత్నా కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ ఆఫీసుకు చేరుకున్నారు.   

నారదా కుంభకోణం కేసులో వీరిని విచారించనుంది. అనంతరం వారిని సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేసే అవకాశముంది.

ఇటీవల గవర్నర్​ జగదీప్ ధన్​కర్​ హకీం సహా తృణమూల్​ సీనియర్​ నేతలపై నారదా స్కామ్​కు సంబంధించి విచారణకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు. 

ఇదీ చదవండి : కొవిడ్ కేంద్రాల్లో సాయానికి సైనిక పశు వైద్యులు

Last Updated : May 18, 2021, 3:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.