ETV Bharat / bharat

బంగాల్ మంత్రి 38 కిలోమీటర్ల సైకిల్ యాత్ర

కోల్​కతాలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.100 దాటినందుకు నిరసనగా.. బంగాల్​ కార్మిక శాఖ మంత్రి బెచరమ్​ మన్నా సైకిల్​ యాత్ర చేపట్టారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు.

Bengal's Labour Minister protest
బంగాల్ మంత్రి సైకిల్ యాత్ర
author img

By

Published : Jul 7, 2021, 3:03 PM IST

పెట్రోల్​ ధరల పెరుగుదలకు నిరసనగా బంగాల్​ కార్మిక శాఖ మంత్రి బెచరమ్​ మన్నా.. సైకిల్​ యాత్ర చేపట్టారు. హూగ్లీ జిల్లాలోని తన నివాసం నుంచి రాష్ట్ర అసెంబ్లీ వరకు దాదాపు 38 కిలోమీటర్లు సైకిల్​ తొక్కారు. కోల్​కతాలో పెట్రోల్​ ధర లీటరుకు రూ.100 దాటిన నేపథ్యంలో ఈ మేరకు నిరసన చేపట్టారు.

Bengal's Labour Minister protest
సైకిల్ యాత్రలో బంగాల్​ మంత్రి

ఉదయం 8 గంటలకు సైకిల్​పై ప్రారంభమైన మన్నా.. మధ్యాహ్నం 12.30 గంటలకు కోల్​కతాలోని అసెంబ్లీ భవనాన్ని చేరుకున్నారు.

Bengal's Labour Minister protest
పెట్రోల్ ధర పెంపుకు నిరసనగా సైకిల్ తొక్కుతూ..

"కేంద్రంలో మోదీ ప్రభుత్వం విఫలమైంది. పెట్రోల్​ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కోల్​కతాలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.100 దాటింది. అందుకే మేము నిరసన చేపడుతున్నాము."

- బెచరమ్​ మన్నా, బంగాల్​ కార్మిక శాఖ మంత్రి

సామాన్య ప్రజలను కేంద్ర ప్రభుత్వం పీల్చి పిప్పి చేస్తోంది. రాష్ట్రంలో తృణమూల్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తూ.. ప్రజలకు మేలు చేస్తోందని మన్నా అన్నారు. టాటా నానో పరిశ్రమకు వ్యతిరేకంగా గతంలో జరిపిన పోరాటంలో మన్నా ప్రాచుర్యం పొందారు.

ఇవీ చదవండి: మమతా బెనర్జీకి చుక్కెదురు- జరిమానా విధించిన హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.