ETV Bharat / bharat

టీటీడీలో ఉద్యోగాలు - ఎంపికైతే భారీగా వేతనాలు! - టీటీడీ ఏఈఈ పోస్టుల భర్తీ

TTD Recruitment 2023: తిరుమల తిరుపతి దేవస్థానం ఏఈఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకోండి.

TTD Recruitment 2023
TTD Recruitment 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 9, 2023, 12:14 PM IST

Tirumala Tirupati Devasthanam Recruitment 2023 : జాబ్​ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసే వారికి గుడ్​న్యూస్​. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD).. మరో జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా ఏఈఈ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలని టీటీడీ స్పష్టం చేసింది. మరి.. ఎన్ని పోస్టులు ఉన్నాయి..? ఎవరు అర్హులు..? విద్యార్హతలు ఏంటి..? వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఎవరు అర్హులు..? (Who is Eligible For TTD Jobs) : ఏపీలోని హిందూ మతానికి చెందిన అభ్యర్థులు.. ఈ ఉద్యోగాలకు అర్హులుగా నోటిఫికేషన్​లో పేర్కొన్నారు.

మొత్తం ఎన్ని ఉద్యోగాలు..? (How Many TTD Jobs) : తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసిన జాబ్ నోటిఫికేషన్​లో మొత్తం 4 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్​/ఎలక్ట్రికల్​) పోస్టులకు టీటీడీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అందులో OC-1, BC(A)-1, SC-1, EWS-1 పోస్టులు ఉన్నాయి.

విద్యార్హతలు ఏంటి..? (Education Qualifications For TTD Jobs): ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి సంబంధించిన విద్యార్హతలను కూడా నోటిఫికేషన్​లో టీటీడీ స్పష్టం చేసింది. బీఈ, బీటెక్‌(ఎలక్ట్రానిక్స్​/ఎలక్ట్రికల్) ఉత్తీర్ణులై ఉండాలని సూచించింది. దీంతోపాటు వయసు కూడా మెన్షన్ చేసింది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు.. 2023 జులై1 నాటికి 42 సంవత్సరాలు మించకూడదని స్పష్టం చేసింది. ఎస్సీ/ ఎస్టీ/ బీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 5 ఏళ్లు, పీహెచ్‌ అభ్యర్థులకు పదేళ్ల వయో సడలింపు ఉంటుందని స్పష్టం చేసింది.

శ్రీవారు కరుణించినా "కరుణాకర్​" కృప లేదు - అన్నప్రసాదంపై విమర్శల పర్వం

ఎలా ఎంపిక చేస్తారు..? (Selection Process For TTD Jobs) : ఈ ఉద్యోగాలను వివిధ దశల్లో పూర్తి చేస్తారు. అభ్యర్థులకు ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో ఉత్తీర్ణులు అయినవారికి ఇంటర్వ్యూలు నిర్వహించి.. ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

వేతనం ఎంత చెల్లిస్తారు..? (How Much Salary Paid For TTD Jobs) : ఏఈఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు రూ.57,100 నుంచి రూ.లక్షా 47వేల 760 వరకు చెల్లిస్తారు.

తిరుమల వెంకటేశ్వర స్వామి ఆస్తి ఎంతో మీకు తెలుసా..?

చివరి తేది ఎప్పుడు(Last Date For TTD Jobs): ఏఈఈ ఉద్యోగాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్​ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో డిసెంబర్‌ 19, 2023లోపు అప్లై చేసుకోవాలి.

అప్లికేషన్​ ఫీజు ఎంత(Application Fee for TTD Jobs):

  • OC అభ్యర్థులకు అప్లికేషన్​ ఫీజు 120 రూపాయలు, పరీక్ష ఫీజు 280 రూపాయలు. మొత్తం రూ.400
  • BC(A), SC, EWS అభ్యర్థులకు అప్లికేషన్​ ఫీజు లేదు. కేవలం పరీక్ష ఫీజు 280 మాత్రమే.
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://ttd-recruitment.aptonline.in/ని సందర్శించి రిజిస్ట్రేషన్​ ప్రాసెస్​ కంప్లీట్​ చేసి జాబ్​కు అప్లై చేసుకోవచ్చు.

TTD Alert : భక్తులకు అలర్ట్.. తిరుమల వెళ్తున్నారా? ఈ విషయం తెలియకుంటే ఇబ్బంది పడతారు!

TTD LATEST NEWS: తిరుమల నడకదారుల్లో ప్రతి భక్తుడి చేతికి కర్ర… కరుణా 'కర్ర' రెడ్డి చారిత్రాత్మక వింత నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.