ETV Bharat / bharat

పెళ్లి టైంకి ప్రేయసికి హ్యాండ్ ఇచ్చిన ఎమ్మెల్యే!

author img

By

Published : Jun 18, 2022, 3:57 PM IST

ఒడిశాలోని తిర్టోల్ శాసనసభ్యుడు బిజయ శంకర్ దాస్​ వివాదంలో చిక్కుకున్నారు. తమ వివాహ రిజిస్ట్రేషన్​కు వస్తానని నమ్మించి రాలేదని ఆయన ప్రియురాలు తెలిపింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని పేర్కొంది.

tirtol mla bijaya shankar das
తిర్టోల్ ఎమ్మెల్యే

ఒడిశాలో బీజేడీ శాసనసభ్యుడు బిజయ శంకర్ దాస్​పై ఆయన ప్రియురాలు పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపింది. 2022 మే17న జగత్‌సింగ్‌పుర్‌లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బిజయ, సోమాలిక తమ వివాహాన్ని నమోదు చేసుకోవడానికి దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తును పరిశీలించిన అధికారులు.. శుక్రవారం వివాహ రిజిస్ట్రేషన్​ చేసుకోవడానికి స్లాట్​ ఇచ్చారు.

సోమాలిక దాస్ శుక్రవారం కార్యాలయానికి వచ్చి తిర్టోల్ ఎమ్మెల్యే బిజయ కోసం ఎదురు చూసింది. ఎమ్మెల్యే, అతని కుటుంబ సభ్యులు ఎవరూ కార్యాలయానికి రాలేదు. దీంతో రెండు గంటలపాటు వారి కోసం నిరీక్షించి సోమాలిక సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయం నుంచి వెళ్లిపోయింది.

"బిజయ ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు. తనకు ఫోన్​ చేసినా స్పందించడం లేదు. ఏం జరిగిందో కచ్చితంగా నాకు తెలియదు. బిజయను ఎవరైనా కిడ్నాప్ చేసి ఉండొచ్చు లేదా ఉద్దేశ్యపూర్వకంగా బిజయ నన్ను మోసం చేసి ఉండవచ్చు. అతనిపై కేసు పెడతాను. "

- సోమాలిక దాస్

ఇవీ చదవండి: మహిళా సాధికారతతోనే భారత్ అభివృద్ధి: మోదీ

'ఆ విషయంలో తగ్గేదే లే'.. అగ్నిపథ్‌ పథకంపై రాజ్‌నాథ్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.