రైతు ఉద్యమ నేత రాకేశ్ టికాయిత్‌పై భాజపా ఎంపీ అక్షయ్‌వర్ లాల్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆదిత్యనాథ్ ప్రభుత్వ పాలన నాలుగున్నరేళ్లు పూర్తయిన సందర్భంగా బహ్రాయిచ్‌లో ప్రసంగిస్తూ మాటతూలారు.
"రాకేశ్ టికాయిత్ బందిపోటు. అసలు రైతుల ఆందోళనే లేదు. నిరసనలు చేస్తున్న వారు రైతులు కాదు. వాళ్లంతా సిక్కుస్థాన్, పాకిస్థాన్ ప్రేరేపిత పార్టీలకు చెందిన వారు. కెనడా సహా పలు దేశాల నుంచి వారికి డబ్బు అందుతోంది. నిజంగా రైతులే ఉద్యమం చేస్తుంటే. ఆహార పదార్థాలు, పండ్లు, కూరగాయలు, పాలు తదితరాలకు కొరత ఏర్పడేది. అవి అసలు మార్కెట్లకే వచ్చేవి కావు" అని అక్షయ్‌వర్ లాల్ విమర్శించారు.
రైతుల ఆందోళన వెనుక వారే..
సాగు చట్టలాకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం స్వయంగా చేపట్టింది కాదని, దానిని కాంగ్రెస్ వెనకుండి నడిపిస్తోందని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై అన్నారు. అందువల్లే నిరసనలు కేవలం దిల్లీలోనే జరుగుతున్నాయని చెప్పారు. సీఎం వ్యాఖ్యలు రాష్ట్ర అసెంబ్లీలో తీవ్ర దుమారం రేపాయి.
ఇదీ చూడండి: Farmers Protest: 'దేశవ్యాప్త ఉద్యమంగా రైతుల ఆందోళన'