ETV Bharat / bharat

కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. ముగ్గురు మృతి

మూడంతస్తుల భవనం కుప్పకూలి ముగ్గురు మృతి చెందారు. శిథిలాల కింద మరో ముగ్గురు కూలీలు చిక్కుకున్నారు. ఈ ఘటన హరియాణాలో జరిగింది. విపత్తు నిర్వాహణ అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

three-storey building collapsed
కుప్పకూలిన మూడంతస్తుల భవనం
author img

By

Published : Jul 19, 2021, 4:54 AM IST

Updated : Jul 19, 2021, 2:25 PM IST

హరియాణా గురుగ్రామ్​లోని ఖావస్​పుర్​ గ్రామంలో విషాదం జరిగింది. ఆదివారం రాత్రి మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. గాయపడిన ఒకరిని ఆస్పత్రికి తరలించారు.

మరో ముగ్గురు కూలీలు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. వారిని బయటకు తీసేందుకు విపత్తు నిర్వహణ బృందం, పోలీసులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

three-storey building collapsed
శిథిలాలను తొలగిస్తూ..
three-storey building collapsed
ఘటనా స్థలివద్ద పోలీసులు

మొత్తం 19 మంది కూలీలు ఈ భవనంలో నివసిస్తున్నట్లు మానేసర్ డీసీపీ వరుణ్​ సింగ్లా తెలిపారు. ఘటనా సమయంలో భవనంలో ఆరుగురు ఉన్నట్లు పేర్కొన్నారు.

three-storey building collapsed
ఘటనా స్థలివద్ద పోలీసులు

భవనం కుప్పకూలటానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు.

ఇదీ చదవండి: నది మధ్యలో చిక్కుకున్న కూలీలు- అతికష్టం మీద...

Last Updated : Jul 19, 2021, 2:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.