ETV Bharat / bharat

విషవాయువుకు ఒకే కుటుంబంలో ముగ్గురు బలి - విషవాయువులకు ముగ్గురు బలి

ఝార్ఖండ్​లోని పల్హిటోలా గ్రామంలో దుర్ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. విషవాయువుల కారణంగానే వారు మృతిచెందారని వైద్యులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్ట్​మార్టంకు తరలించారు.

well
విషవాయువులకు ముగ్గురు బలి
author img

By

Published : Mar 12, 2021, 6:15 AM IST

బావిలో స్పృహ తప్పి పడిపోయిన కుమారుడిని కాపాడేందుకు వెళ్లిన తండ్రి కూడా స్పృహ కోల్పోయాడు. వీరిద్దరి కోసం బావిలోకి దిగిన వారి బంధువుకి కూడా అదే పరిస్థితి ఎదురైంది. అనంతరం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన ఝార్ఖండ్​లోని లాతేహర్ జిల్లా పల్హిటోలా గ్రామంలో గురువారం జరిగింది.

అసలేం జరిగింది..

బావిలో ఉన్న మోటార్​ను వెలికితీసేందుకు అశీశ్​ టొప్పో (15) అందులోకి దిగాడు. కానీ ఉన్నట్లుండి స్పృహ తప్పి పడిపోయాడు. కుమారుడికి ఏమై ఉంటుందా అని బావిలోకి దిగిన తండ్రి సైమన్ టొప్పో (45)కు కూడా అదే పరిస్థితి ఎదురైంది. వీరిద్దరిని రక్షించేందుకు వారి బంధువైన అనుప్​ టొప్పో (26) కూడా బావిలోకి దిగాడు. కానీ అతడు కూడా ముందు వెళ్లిన తండ్రీ కొడుకుల లాగానే స్పృహ కోల్పోయాడు. గ్రామస్థులు వీరిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

అదే కారణమా..?

బావిలో ఉన్న విషవాయువుల కారణంగానే వీరు మృతిచెందినట్లు వైద్యులు ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు. మృతదేహాలను పోస్ట్​మార్టంకు తరలించారు.

ఇదీ చదవండి : లైవ్​ వీడియో: ఆగి ఉన్న లారీ బోల్తా కొట్టింది..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.