ఫ్రాన్స్ నుంచి మరో 3 రఫేల్ యుద్ధ విమానాలు బుధవారం సాయంత్రం భారత్‌కు చేరుకున్నాయి. నాలుగో దశలో భాగంగా ఫ్రాన్స్‌లోని ఐస్ట్రెస్ ఎయిర్ బేస్ నుంచి ఎక్కడా ఆగకుండా నేరుగా భారత్‌లో అడుగుపెట్టాయి. ఈ క్రమంలో మార్గమధ్యలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాయుసేన ట్యాంకర్లు గాలిలోనే రఫేల్ జెట్లకు ఇంధనం నింపాయి. ఇది ఇరు దేశాల బలమైన సంబంధాలను సూచిస్తోందని పేర్కొంది భారత వాయుసేన.
-
Rafales were refuelled in-flight by UAE Air Force tankers. This marks yet another milestone in the strong relationship between the two Air Forces: Indian Air Force pic.twitter.com/pg5iFxxTPa
— ANI (@ANI) March 31, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Rafales were refuelled in-flight by UAE Air Force tankers. This marks yet another milestone in the strong relationship between the two Air Forces: Indian Air Force pic.twitter.com/pg5iFxxTPa
— ANI (@ANI) March 31, 2021Rafales were refuelled in-flight by UAE Air Force tankers. This marks yet another milestone in the strong relationship between the two Air Forces: Indian Air Force pic.twitter.com/pg5iFxxTPa
— ANI (@ANI) March 31, 2021
" ఫ్రాన్స్‌లోని ఐస్ట్రెస్ ఎయిర్ బేస్ నుంచి నేరుగా భారత భూభాగంలో అడుగుపెట్టాయి నాలుగో దశ రఫేల్ యుద్ధ విమానాలు. మార్గ మధ్యలో రఫేల్‌కు ఇంధనం నింపిన యూఏఈ వాయుసేనకు కృతజ్ఞతలు. ఇరు దేశాల వాయుసేనల మధ్య సంబంధాల్లో ఇదో కీలక మైలురాయి. "
- భారత వాయుసేన.
అయితే.. ఈ రఫేల్ యుద్ధ విమానాలు ఎక్కడ ల్యాండ్ అయ్యాయనేది వెల్లడించలేదు.
భారత అమ్ములపొదిలో 14 రఫేల్‌లు
తాజాగా మూడు రఫేళ్ల రాకతో.. మొత్తం భారత్‌కు చేరుకున్న విమానాల సంఖ్య 14కు చేరుకుంది.
ఫ్రాన్స్ నుంచి 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు రూ.59వేల కోట్ల విలువైన ఒప్పందం చేసుకుంది భారత్. సుమారు నాలుగేళ్ల తర్వాత గతేడాది జులై 29న తొలి బ్యాచ్‌లో 5 రఫేల్‌లు భారత్‌కు చేరుకున్నాయి. సెప్టెంబర్ 10న వాయుసేన అమ్ములపొదిలో చేరాయి.
రెండో బ్యాచ్ 2020, నవంబర్ 3న మూడు రఫేల్‌లు భారత్‌కు చేరుకున్నాయి. మూడో బ్యాచ్‌లో మరో 3 రఫేల్‌లు 2021, జనవరి 27న వాయుసేనలో చేరాయి. మరో నెల రోజుల్లో 7 రఫేల్‌లు భారత్‌కు చేరనున్నాయి.
తొలి రఫేల్ స్క్వాడ్రాన్‌ను హరియాణాలోని అంబాలాలో ఏర్పాటు చేశారు. రెండో స్క్వాడ్రాన్‌ను బంగాల్లోని బసిమారాలో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు చేస్తోంది వాయుసేన.
ఇదీ చూడండి: భారత్‌కు మరో 10 రఫేల్ యుద్ధ విమానాలు