ETV Bharat / bharat

భారత్​ చేరుకున్న మూడు రఫేల్​ జెట్లు - రఫేల్ న్యూస్

మూడు రఫేల్ యుద్ధ విమానాలు భారత్​కు చేరుకున్నాయి. మార్గమధ్యంలోనే ఇంధనాన్ని నింపుకున్నాయని వెల్లడించింది. ఇందుకు యూఏఈ వాయుసేన సహకరించిందని పేర్కొంది.

india rafale
భారత్​ చేరుకున్న మూడు రఫేల్​ జెట్లు
author img

By

Published : Jan 28, 2021, 5:15 AM IST

భారత అమ్ముల పొదిలో మరో మూడు రఫేల్ యుద్ధ విమానాలు చేరాయి. మూడో విడతలో భాగంగా ఫ్రాన్స్​ నుంచి మూడు జెట్లు భారత్​కు బుధవారం సాయంత్రం చేరుకున్నాయి. దీంతో దేశంలోని రఫేల్ జెట్ల సంఖ్య 11కు చేరింది. చైనాతో సరిహద్దులో ఘర్షణ నేపథ్యంలో ఇవి వాయుసేనకు మరింత బలం చేకూర్చనున్నాయి.

రఫేల్ జెట్లు దాదాపు 7 వేల కిలోమీటర్లు నిరంతరాయంగా ప్రయాణించి భారత్​కు చేరుకున్నాయని వాయుసేన తెలిపింది. మార్గమధ్యంలోనే ఇంధనాన్ని నింపుకున్నాయని వెల్లడించింది. ఇందుకు యూఏఈ వాయుసేన సహకరించిందని పేర్కొంది.

  • The third batch of three Rafale aircraft landed at an IAF base a short while ago. They flew over 7000Km with in-flight refuelling. The aircraft got airborne earlier in the day from #IstresAirBase in France. IAF deeply appreciates the tanker support provided by UAE Air Force. pic.twitter.com/tykLthzVlx

    — Indian Air Force (@IAF_MCC) January 27, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"మూడో విడత రఫేల్ ఎయిర్​క్రాఫ్ట్​లు ఐఏఎఫ్ బేస్​కు చేరుకున్నాయి. 7 వేల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చాయి. ఫ్రాన్స్​లోని ఇస్ట్రెస్ ఎయిర్​బేస్​ నుంచి ఇవి బయలుదేరాయి. రీఫ్యూయెలింగ్​కు యూఏఈ వాయుసేన మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు."

-భారత వాయుసేన ట్వీట్

2020 జులై 29న రఫేల్ తొలి బ్యాచ్ భారత్​కు చేరుకుంది. ఇందులో ఐదు రఫేల్ విమానాలు ఉన్నాయి. నవంబర్ 3న రెండో విడతలో భాగంగా మూడు రఫేల్ జెట్లు భారత్​కు వచ్చాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.