ETV Bharat / bharat

ఎక్స్​ప్రెస్​వేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు నుజ్జునుజ్జు - ముంబయి పుణెె రోడ్డు ప్రమాదం

మహారాష్ట్రలోని రాయగఢ్​​ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో గాయపడిన ఆరుగురిని అధికారులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. రెండు ట్రక్కుల మధ్య ఓ కారు నుజ్జునుజ్జు అయ్యింది.

mumbai pune express way
ఎక్స్​ప్రెస్​వేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
author img

By

Published : Oct 18, 2021, 11:45 AM IST

మహారాష్ట్రలోని రాయగఢ్​ జిల్లా ముంబయి- పుణె ఎక్స్​ప్రెస్​వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మూడు వాహనాలు ఢీకొన్న ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం ఉదయం సుమారు 5.30 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం.

mumbai pune express way
ధ్వంసమైన కారు

ట్రక్కు అదుపు తప్పడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. మితినీరిన వేగంతో ప్రయాణిస్తున్న ట్రక్కు అదుపు తప్పి ముందున్న కారును ఢీకొందని.. ఈ క్రమంలో ఆ కారు దాని ముందున్న మరో ట్రక్కును ఢీకొందని తెలిపారు. ఈ ప్రమాదంలో రెండు ట్రక్కుల మధ్య కారు నుజ్జునుజ్జు అయ్యింది. ముగ్గురు మరణించారు.

mumbai pune express way
ప్రమాదంలో ధ్వంసమైన కారు

ఈ ఘటనలో గాయపడిన ఆరుగురిని అధికారులు స్థానిక ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి : పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం.. ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.