Durgapur Steel Plant Gas Leak: బంగాల్లోని దుర్గాపుర్ స్టీల్ ప్లాంట్లో గ్యాస్ లీకై ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ఐదుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. మృతులను సజల్ చౌహాన్, సింతూ యాదవ్, సంతోష్ చౌహాన్గా గుర్తించారు.

అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగినట్లు కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ప్లాంట్ ఆధునికీకరణకు నోచుకోకపోవడం వల్ల కార్మికులు బాధితులుగా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు కార్మికులకు సరైన భద్రతా శిక్షణ ఇవ్వకపోవడం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నట్లు చెప్పారు.

మరోవైపు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు ప్లాంట్ యాజమాన్యం తెలిపింది.
ఇదీ చూడండి: గ్రామస్థులపైకి దూసుకొచ్చిన ఏనుగు.. కానీ ఒకే ఒక్కడు..