ETV Bharat / bharat

ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగికి బాంబు బెదిరింపు - Threat to kill PM Modi

దీపక్​ శర్మ అనే వ్యక్తి ట్విట్టర్​ ఖాతా నుంచి ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగికి బాంబు బెదిరింపు సందేశం అందింది. ట్వీట్​కు డయల్​ 112ను ట్యాగ్​ చేశాడు నిందితుడు. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన అధికారులు.. నిందితుడిని త్వరలోనే అరెస్ట్​ చేస్తామని చెప్పారు.

Threat to kill PM Modi
ప్రధాని మోదీ- యూపీ సీఎం యోగికి బాంబు బెదిరింపు
author img

By

Published : Nov 7, 2021, 9:18 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​కు బాంబు బెదిరింపు వచ్చింది. రెండు రోజుల క్రితం దీపక్​ శర్మ అనే వ్యక్తి ట్విట్టర్​ ఖాతా నుంచి ఈ బెదిరింపు ట్వీట్ బయటకొచ్చింది​. డయల్​ 112ను ట్వీట్​తో ట్యాగ్​ చేశారు నిందితులు. ఈ ఘటనను లఖ్​నవూ పోలీసులు తీవ్రంగా పరిగణించారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. క్రైమ్​ బ్రాంచ్​కు ఈ కేసును అప్పగించారు. క్రైమ్​ బ్రాంచ్​ డీసీపీ పీకీ తివారీ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

అయితే ఘటన జరిగి రెండు రోజులు గడిచినా.. పోలీసులు ఈ వ్యవహారంపై ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు. దంతేరస్​ రోజున ఈ ట్వీట్​ చేశారు. ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగిని బాంబు పేల్చి చంపుతామని అందులో రాసుకొచ్చారు. అయితే ఆ ట్విట్టర్​ ఖాతా నకిలీదని పోలీసులు భావిస్తున్నారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని, నిందితులను పట్టుకున్నామని పీకే తివారీ చెప్పారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:- బోర్డర్​లో 'టిఫిన్​ బాక్స్​ బాంబుల' కలకలం- అసలేం జరుగుతోంది?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.