ETV Bharat / bharat

విమానాశ్రయం పేరు మార్చాలంటూ ఆందోళన!

మహారాష్ట్ర ముంబయిలోని సిబీడీ బేలాపుర్​లో దాదాపు 10,000 మందికిపైగా ఆందోళనకు దిగారు. కొత్తగా నిర్మిస్తున్న ఎయిర్​పోర్టు పేరు మార్చాలని డిమాండ్ చేశారు.

maharashtra
మహారాష్ట్ర, ఆందోళన
author img

By

Published : Jun 24, 2021, 8:51 PM IST

Updated : Jun 25, 2021, 7:48 AM IST

మహారాష్ట్ర ముంబయిలో.. కొత్తగా నిర్మిస్తున్న నవీ ముంబయి(Navi Mumbai) అంతర్జాతీయ విమానాశ్రయానికి స్థానిక దివంగత నేత డీబీ పాటిల్​ పేరు పెట్టాలంటూ వేలాదిమంది పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఆగస్టు 15 కల్లా ఈ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాయ్​గఢ్​, థానే, పాలగఢ్​కు చెందిన వేల మంది సీబీడీ బేలాపుర్​లో ఆందోళనలు చేపట్టారు.

mumbai
పెద్ద ఎత్తున ఆందోళన
maharashtra
విమానాశ్రయం పేరు మార్చాలని డిమాండ్

దాదాపు 10,000 మందికి పైగా నిరసనకారులు ప్రభుత్వ రంగ సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్​మెంట్ కార్పొరేషన్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నూతన విమానాశ్రయానికి శివసేన దివంగత బాల్​ ఠాక్రే పేరు పెట్టకూడదని డిమాండ్​ చేశారు. అయితే.. ఈ ఆందోళనలో భాజపా కార్యకర్తలతో పాటు కాంగ్రెస్​ కార్యకర్తలూ పాల్గొనడం గమనార్హం.

police, maharashtra
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు

ఇదీ చదవండి:'భాజపాతో రాజీ మేలు'- ఆ సీఎంకు ఎమ్మెల్యే లేఖ

Last Updated : Jun 25, 2021, 7:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.