హరియాణా కర్నాల్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కర్నాల్ మినీ సెక్రటేరియట్‌ను చుట్టుముట్టేందుకు వేలాది మంది రైతులు జిల్లా ప్రధాన కార్యాలయానికి తరలివెళ్లారు. హింసాత్మక ఘటనలు జరగకుండా ఆ ప్రాంతంలో పోలీసులను భారీస్థాయిలో మోహరించారు అధికారులు.
లాఠీఛార్జ్‌కు నిరసనగా..
ఆగస్టు 28న కర్నాల్ ప్రాంతంలో రైతులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. సంబంధిత అధికారులపై చర్యలు చేపట్టాలని రైతు సంఘాలు అప్పటి నుంచి డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో మంగళవారం ఉదయం న్యూ అనాజ్ మండీ వద్ద మహాపంచాయత్ నిర్వహించగా.. సభకు పంజాబ్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్ నుంచి వేలాది మంది రైతులు తరలివెళ్లారు.
లాఠీఛార్జ్‌కు ఆదేశాలిచ్చిన ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేయాలన్నదే తమ డిమాండ్ అని బీకేయూ నేత రాకేశ్ టికాయత్ స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో 11 మంది సభ్యుల బృందాన్ని పిలిపించి వారి డిమాండ్లపై చర్చించింది స్థానిక యంత్రాంగం. అయినప్పటికీ ఫలితం లేకపోవడం వల్ల సచివాలయం ముట్టడికి రైతులు దూసుకెళ్లారు.
నిరసనలు శాంతియుతంగా సాగాలని రైతు నేతలు పిలుపునిచ్చారు. ఎవరూ హింసకు పాల్పడకూడదని, పోలీసులతో గొడవకు దిగొద్దని స్పష్ట చేశారు.
ఇదీ చూడండి:- Farmers protest: అన్నదాతలపై పోలీసుల లాఠీఛార్జి