ETV Bharat / bharat

దేశ ఐక్యతను చాటి చెప్పేలా పాట రాసిన సీఎం - బంగాల్ ముఖ్యమంత్రి పాట

దేశ ఐక్యతను చాటి చెబుతూ దేశభక్తి గీతాన్ని రాశారు బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. 'దేశ్‌ త సోబర్ నిజర్' (ఈ దేశం మనందరిది) అంటూ సాగే ఈ పాటను దీదీ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో శనివారం రాత్రి పోస్టు చేశారు.

song by mamata benarjee
మమతా బెనర్జీ రాసిన పాట
author img

By

Published : Aug 15, 2021, 4:44 PM IST

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దేశ ఐక్యతను చాటి చెబుతూ దేశభక్తి గీతాన్ని రాశారు. 'దేశ్‌ త సోబర్ నిజర్' (ఈ దేశం మనందరిది) అంటూ సాగే ఈ పాటను బెంగాలీకి చెందిన ఇంద్రనీల్ సేన్, మోనోమోయ్ భట్టాచార్య, త్రిష పరుయ్, దేవజ్యోతి ఘోష్ ఆలపించారు. దీన్ని ఒక వీడియో రూపంలో అద్భుతంగా చిత్రీకరించారు. దీదీ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో శనివారం రాత్రి ఈ వీడియోను పోస్టు చేశారు. తాజాగా సోషల్‌ మీడియాలో ఇది తెగ చక్కర్లు కొడుతోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మరోవైపు.. స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన మహనీయులను మర్చిపోకూడదంటూ మమత ఓ ట్వీట్​ చేశారు.

"మన స్వేచ్ఛను అణచివేయాలని చూస్తున్న దుష్ట శక్తులను తరిమికొడదాం. అందరం ఐకమత్యంతో కలిసి పోరాడదాం. మనకు స్వాతంత్య్రం తీసుకురావడానికి ఎందరో మహనీయులు వారి ప్రాణాలను త్యాగం చేశారు. వారిని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు"

-మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కోల్‌కతాలో ప్రసిద్ధి చెందిన విక్టోరియా మెమోరియల్‌పై 7,500 చదరపు అడుగుల భారీ త్రివర్ణ పతాకాన్ని ఏర్పాటుచేశారు. ఆ రాష్ట్ర గవర్నర్‌ జగ్‌దీప్‌ ధన్‌కర్‌ జెండాను ఆవిష్కరించారు.

ఇదీ చూడండి: 'నవ భారత్​ కోసం రూ.100 లక్షల కోట్లతో ప్రగతి యజ్ఞం'

ఇదీ చూడండి: ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఆవిష్కరణ సుందర దృశ్యాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.