ETV Bharat / bharat

యాపిల్​, మెక్​ఎఫీ పేర్లతో మోసం- 34 మంది అరెస్టు - అక్రమంగా నిధులు కొల్లగొట్టిన స్కామ్ దిల్లీ

ప్రముఖ సాంకేతిక సంస్థల పేరుతో విదేశీయులను బురిడీ కొట్టించిన ముఠాను దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాంకేతిక సహాయం అందిస్తామని వీరు అక్రమంగా డబ్బులు దండుకున్నారని పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితులు ఫేక్ కాల్ సెంటర్లను నడిపిస్తున్నట్లు గుర్తించారు.

Thirty-four held in Delhi for running fake call centres, extortion
ఫేక్ కాల్ సెంటర్లతో మోసం- 34 మంది అరెస్టు
author img

By

Published : Mar 21, 2021, 9:55 AM IST

విదేశీయుల నుంచి అక్రమంగా నిధులు కొల్లగొట్టిన స్కామ్​లో 34 మందిని దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు.. అమెరికా డ్రగ్ ఎన్​ఫోర్స్​మెంట్, యాపిల్ టెక్నికల్ అసిస్టెంట్, మెక్ఎఫీ యాంటీవైరస్ సపోర్ట్ సిబ్బంది నుంచి ఫోన్ చేస్తున్నట్లు నటించి.. బాధితులను బురిడీ కొట్టించేవారని పోలీసులు తెలిపారు.

Thirty-four held in Delhi for running fake call centres, extortion
నిందితులు

కీలక నిందితులైన క్షితిజ్ బాలి, అభిషేక్, ధనంజయ్ నేగిలు అక్రమంగా రెండు కాల్ సెంటర్లను నడిపిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. ఉత్తరమ్​నగర్​లోని ఓ భవనంలో వీరు తమ కార్యకలాపాలు కొనసాగించారని చెప్పారు.

కాల్ సెంటర్ కార్యాలయం

అమెరికా అధికారులమంటూ చెప్పి విదేశీయులకు వాయిస్ రికార్డింగ్​లు పంపించినట్లు దిల్లీ పోలీసులు గుర్తించారు. దీంతో పాటు మెక్ఎఫీ సాంకేతిక సహాయ బృందాల పేరిట వినియోగదారులకు పాప్-అప్ మెసేజ్​లు పంపించి తమ పరికరాలు హ్యాక్ అయ్యాయని మభ్యపెట్టేవారని తెలిపారు. దానికి సాంకేతిక సహాయం అందిస్తామని డబ్బులు దండుకున్నారని వెల్లడించారు. యాపిల్ సంస్థ పేరు మీద కూడా రికార్డింగ్ మెసేజ్​లు పంపేవారని తెలిపారు.

ఇదీ చదవండి: 18 మందిని పెళ్లాడి.. నగలతో పరారీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.