ఓ దొంగ పోలీసులకు దొరకకూడదని తాను దొంగిలించిన 35 గ్రాముల బంగారాన్ని మింగేశాడు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.
ఇదీ జరిగింది..
దక్షిణ కన్నడ జిల్లాలోని సులియా, పుత్తూర్ ప్రాంతాల్లో జరిగిన ఓ దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్న శిబును పోలీసులు అరెస్టు చేశారు. కేరళకు చెందిన ఈ దొంగను అరెస్టు అయితే చేశారు కానీ.. వారికి ఆ బంగారం ఎక్కడుందీ తెలియలేదు.
ఇంతలో ఆ దొంగకు తీవ్రంగా కడుపు నొప్పి రావడం వల్ల అతడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అతడికి ఎక్స్‌రే తీయగా పొత్తికడుపులో బంగారు ఉంగరాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆపరేషన్ చేసి వాటిని బయటకు తీయించి.. పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో బంగారం గురించి పోలీసులకు తెలియకుండా ఉండేందుకు ఐస్‌క్రీంతో పాటు వాటిని తీనేశానని నిందితుడు వెల్లడించాడు.
నిందితుడు ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాడని.. అతడిని జుడీషియల్ కస్టడీకి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదీ చదవండి : కుమారుడి పెళ్లి సింపుల్‌గా.. రూ.2లక్షలు విరాళంగా..