ETV Bharat / bharat

కమల్​ నోట 'థర్డ్​ ఫ్రంట్​' మాట - Assembly Eelction

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు థర్డ్​ ఫ్రంట్​ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు మక్కల్​ నీది మయ్యమ్​ అధినేత​ కమల్​ హాసన్​. రజనీకాంత్​తో పొత్తు గురించి మాట్లాడేందుకు ఇది సరైన సమయం కాదని వ్యాఖ్యానించారు.

There will be Third Front in Tamil Nadu Assembly Election
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో థర్డ్​ ఫ్రంట్​: కమల్​
author img

By

Published : Dec 16, 2020, 2:25 PM IST

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు థర్డ్​ ఫ్రంట్​ ఏర్పడుతుందని అన్నారు మక్కల్​ నీది మయ్యమ్​ పార్టీ సారథి కమల్​ హాసన్​. తిరునెల్వేలిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్​తో పొత్తు గురించి మాట్లాడేందుకు ఇది సరైన సమయం కాదని భావిస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చూడండి: రజనీతో పొత్తుకు 'ఫోన్​కాల్​' దూరంలో కమల్‌

''ఎంఎన్​ఎం అధికారంలోకి వస్తే.. ఏర్పడి తమిళనాడును అవినీతి రహితంగా మారుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా థర్డ్​ ఫ్రంట్​ ఉంటుంది. మంచి సిద్ధాంతాలు ఉన్నవారితోనే ఎంఎన్​ఎం జట్టుకడుతుంది. నేను రజనీ గురించి మాట్లాడుతున్నంత మాత్రాన ఆధ్యాత్మిక రాజకీయాల వైపు వెళ్తున్నట్లు కాదు. ఎంజీఆర్​ వారసత్వాన్ని కొనసాగించే హక్కు నాకు ఉంది. ఆయన పార్టీలకతీతంగా మంచి నేత. ఇంకా నేను చిన్ననాటి నుంచి ఆయనకు సన్నిహితంగానే ఉన్నా.''

- కమల్​ హాసన్​, మక్కల్​ నీది మయ్యమ్​ అధినేత​

పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు కమల్​. ఎన్నికల్లో తాను పోటీచేయాలని చాలా మంది కోరుతున్నారని, దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు.

హిందీని బలవంతంగా రుద్దడంపైనా ఆయన మాట్లాడారు. తనకు తమిళంతో పాటు హిందీ కూడా ఇష్టమేనని, అయినంతమాత్రాన హిందీని బలవంతంగా రుద్దితే ప్రజలు ఊరుకోరని అన్నారు.

ఇదీ చూడండి: హిందీని బలవంతంగా రుద్దొద్దు: రజనీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.