ETV Bharat / bharat

'ఈనెల 24, 25 తేదీల్లో సంపూర్ణ లాక్​డౌన్​'

కరోనా కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో రెండు రోజుల పాటు లాక్​డౌన్​ విధిస్తున్నట్లు కేరళ రాష్ట్ర సర్కారు ప్రకటించింది. అంతకు ముందు రోజున.. రాష్ట్రవ్యాప్తంగా మూడు లక్షల కొవిడ్​ పరీక్షలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది.

author img

By

Published : Jul 21, 2021, 4:42 PM IST

complete lockdown
సంపూర్ణ లాక్​డౌన్​

కొవిడ్​ కేసులు తగ్గినట్టే తగ్గి.. మళ్లీ పెరుగుతుండటం వల్ల కఠిన నిబంధనలు అమలు చేస్తోంది కేరళ. ఈ క్రమంలో ఈనెల 24, 25తేదీల్లో (శని, ఆదివారాలు) సంపూర్ణ లాక్​డౌన్​ విధిస్తున్నట్టు ఆ రాష్ట్ర సర్కారు ప్రకటించింది. దీనికి కూడా జూన్​ 12,13 తేదీల్లో విధించిన లాక్​డౌన్​ మార్గదర్శకాలే వర్తిస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు సైతం మూసివేయనున్నట్లు ప్రకటించింది. వివిధ ప్రాంతాల్లో నమోదవుతున్న పాజిటివిటీ రేటు ఆధారంగా ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొంది.

ఈ నెల 23 తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల కొవిడ్​ నమూనాలను పరీక్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏడో రోజు సగటు పాజిటివిటీ రేటు 10 శాతం కంటే ఎక్కువగా నమోదవుతున్న జిల్లాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు తెలిపింది.

ఇదీ చూడండి: అప్పటివరకు ఎర్రకోట బంద్​- కారణమిదే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.