గుజరాత్ ఆనంద్ జిల్లాలో నవరాత్రి వేడుకల్లో విషాదం నెలకొంది. తారాపుర్లో జరుగుతున్న దసరా వేడుకల్లో వీరేంద్ర సింగ్ రాజ్‌పుత్ అనే యువకుడు గర్బా డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు. కార్యక్రమ నిర్వాహకులు హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే వీరేంద్ర ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు తెలిపారు. ఈ ఘటన సెప్టెంబరు 30న జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
కొడుకు మరణవార్తను తట్టుకోలేక..
మరోవైపు, మహారాష్ట్ర పాల్ఘర్లోని విరార్‌లో దారుణం జరిగింది. గర్బా నృత్యం చేస్తూ మనీశ్ (35)అనే వ్యక్తి కుప్పకూలి.. ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన శనివారం రాత్రి జరిగింది. కొడుకు మరణవార్తను విన్న తండ్రి నర్పాజీ తట్టుకోలేక ఇంట్లోనే కుప్పకూలిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. మనీశ్, నర్పాజీ మృతదేహాలను విరర్ పోలీసులు పోస్టుమార్టానికి తరలించారు.
ఇవీ చదవండి: 29 ఏళ్ల పంతానికి తెర.. రెండు వర్గాలను కలిపిన రాహుల్ గాంధీ!
వాయుసేనకు 'ప్రచండ' అస్త్రం.. కన్ఫ్యూజ్ చేస్తూ శత్రువుకు దెబ్బ!