ETV Bharat / bharat

జపాన్ సహకారంతో పట్టణాభివృద్ధికి కేంద్రం పచ్చజెండా - జపాన్​తో భారత్​ అవగాహన ఒప్పందం

సుస్థిర పట్టణాభివృద్ధికి జపాన్​ సహకారం తీసుకోవాలని కేంద్ర మంత్రివర్గం బుధవారం నిర్ణయించింది. పట్టణ ప్రణాళిక, ఆకర్షణీయ నగరాలు, అందుబాటులోని ఇళ్లు, నగర వరదల నివారణ, మురుగునీటి వ్యవస్థ, పట్టణ రవాణా తదితర అంశాల్లో ఉభయ దేశాలు సహకరించుకుంటాయి.

india mou with japan
పట్టణాభివృద్ధిపై జపాన్​తో భారత్​ అవగాహన ఒప్పందం
author img

By

Published : Jun 3, 2021, 5:25 AM IST

సుస్థిర పట్టణాభివృద్ధికి జపాన్​ సహకారం తీసుకోవాలని కేంద్ర మంత్రివర్గం బుధవారం నిర్ణయించింది. ఈ విషయమై కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ.. జపాన్ మౌలిక వసతులు, రవాణా, పర్యాటక శాఖల మధ్య 2007లో కుదిరిన అవగాహన ఒప్పందం కాలపరిమితి ముగియడంతో కొత్తగా సహకరార ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ముసాయిదాకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

పట్టణ ప్రణాళిక, ఆకర్షణీయ నగరాలు, అందుబాటులోని ఇళ్లు, నగర వరదల నివారణ, మురుగునీటి వ్యవస్థ, పట్టణ రవాణా తదితర అంశాల్లో ఉభయ దేశాలు సహకరించుకుంటాయి. వీటిని అమలు చేయడానికి ఉమ్మడి కార్యారచరణ బృందం ఏర్పాటవుతుంది. ఈ బృందం ఏడాదికి ఒకసారి సమావేశమవుతుంది. ఒక భేటీ భారత్​లో జరిగితే మరొకటి జపాన్​లో నిర్వహిస్తారు. సంతకాలు జరిగిన తేదీ నుంచి నూతన ఒప్పందం అయిదేళ్ల పాటు అమల్లో ఉంటుంది. మరోవైపు పట్టణాభివృద్ధి విషయంలో మాల్దీవులతోనూ ఒప్పందం కుదిరింది. ఫిబ్రవరిలో కుదిరిన ఈ ఒప్పందానికి కేంద్రం తాజాగా ఆమోదం తెలిపింది.

ఇదీ చదవండి: ఎన్ని టీకాలు కొన్నారో చెప్పండి: సుప్రీం

:Supreme Court: 'టీకా బడ్జెట్​లో ఎంత ఖర్చు చేశారు?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.