72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దిల్లీలోని రాజ్‌పథ్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆయనతో పాటు ఉన్నారు. ఈ సందర్భంగా సైనికులు నిర్వహించిన పరేడ్ అబ్బురపరిచింది.
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించిన వేడుకల్లో దాదాపు 25 వేల మంది ఆహుతులు పాల్గొన్నారు.