ETV Bharat / bharat

Amaravati: అమరావతి రాజధాని కేసు డిసెంబర్‌కు వాయిదా - Supreme court

అమరావతి రాజధాని కేసు
అమరావతి రాజధాని కేసు
author img

By

Published : Jul 11, 2023, 12:57 PM IST

Updated : Jul 11, 2023, 5:45 PM IST

12:50 July 11

అత్యవసర విచారణ సాధ్యం కాదన్న సుప్రీం ధర్మాసనం

అమరావతి రాజధాని కేసు

Amaravati case in Supreme court: అమరావతి రాజధాని కేసును అత్యవసరంగా చేపట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తికి సుప్రీంకోర్టు విముఖత చూపింది. ఈ ఏడాది డిసెంబర్ లొనే తదుపరి విచారణ చేపడతామని... ఆలోపు సాధ్యం కాదు అని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం తేల్చి చెప్పింది. అత్యవసరంగా ఈ కేసు విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. తదుపరి విచారణ తేదీని కూడా డిసెంబర్ లొనే ప్రకటించనున్నట్లు పేర్కొంటూ... కేసు విచారణ వాయిదా వేసింది.

అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ... రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పీలపై సర్వోన్నత న్యాయస్థానం ఈ ఏడాది డిసెంబర్ లో చేపట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను ప్రధాన పిటిషన్ గా స్వీకరిస్తున్నట్లు ప్రకటించిన ధర్మాసనం... ఈ కేసు విచారణ చాలా సమయం తీసుకుంటుంది కాబట్టి... ఇప్పటికిప్పుడు అంత సమయం కేటాయించడం కుదరక పోవచ్చు అని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేలా ఎం త్రివేది ల ధర్మాసనం స్పష్టం చేసింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది మాజీ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ స్పందించారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన విషయం అని, కేసు తీవ్రత దృష్ట్యా... కేసును అత్యవసరంగా విచారించాలని కోరారు. తనకు కనీసం మూడు గంటలు సమయం అవసరం అని పేర్కొన్నారు. దీనికి స్పందించిన ధర్మాసనం... ఇప్పుడు అంత టైమ్ ఇవ్వడం సాధ్యం కాదని పేర్కొంది. పైగా ఆఫీసు రిపోర్ట్ ప్రకారం... ప్రతివాదులు అందరికీ ఇంకా నోటీసులు పంపలేదని జస్టిస్ సంజీవ్ ఖన్నా పేర్కొన్నారు. ప్రతివాదులు అందరికి నోటీసులు పంపకుండా కేసు విచారణ చేపట్టడం కుదరదు అని చెప్పారు. అందరికీ నోటీసులు పంపేందుకు రిజిస్టార్ కు నివేదించాలని ఆదేశించారు. ఈ సందర్భంలో జోక్యం చేసుకున్న వేణుగోపాల్... అందరికీ నోటీసులు జారీ చేస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించే విషయం పరిశీలించాలని కోరగా... అందుకు ధర్మాసనం నిరాకరించింది.

ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపు ఏఓఆర్.. మెహపూజ్ నఙ్కి కల్పించుకుని... ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న ఇద్దరు రైతులు మరణించారని, వారికి మినహా అందరికీ భౌతికంగా నోటీసులు అందించినట్లు తెలిపారు. మరణించిన ఇద్దరు ప్రతివాదుల పేర్లు ప్రతివాదుల జాబితా నుంచి తొలగించాలని మరో అప్లికేషన్ దాఖలు చేసినట్లు చెప్పారు. ఆ ఇద్దర్ని మినహాయిస్తే మిగిలిన వారందరికీ నోటీసులు జారీచేసినట్లేనా? అని ధర్మాసనం ప్రశ్నించగా... అందుకు ఏపీ ఏఓఆర్ అవునని బదులిచ్చారు. ఏఓఆర్ చెప్పిన విషయాన్ని రికార్డులోకి తీసుకొని జస్టిస్ సంజీవ్ ఖన్నా చనిపోయిన ఇద్దరు ప్రతివాదుల పేర్లను తొలగించాలని ఆదేశించారు. ఏపీ ప్రభుత్వ న్యాయవాది చేసిన ప్రకటన ప్రకారం ఈ ఇద్దరు మినహాయిస్తే మిగిలినవారందరికీ నోటీసులు జారీచేసినట్లేనని పేర్కొన్నారు.

రైతుల తరుపున హాజరైన సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ జోక్యం చేసుకుంటూ కేవలం అది కేవలం రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కేసు వరకే పరిమితమని, మిగిలిన కేసుల్లో కాదని ధర్మాసనం దృష్టికి తీసుకురాగా... జస్టిస్ సంజీవ్ ఖన్నా జోక్యం చేసుకుంటూ మిగతా కేసుల్లో ఉన్న ప్రతివాదులకు నోటీసులు జారీచేశారా? అని ప్రశ్నించారు. అందుకు ఏపీ ప్రభుత్వ ఏఓఆర్ స్పందిస్తూ... ఏపీ హైకోర్టు 70 కేసుల్లో ఉమ్మడి తీర్పు ఇచ్చిందని, ఆ కేసులన్నింటిపై స్టే కోరుతూ తాము ఎస్ఎల్పీ దాఖలు చేసినట్లు చెప్పారు. తాము దాఖలు చేసిన అప్పీల్ లో అందరూ ప్రతివాదులుగా ఉన్నారని, వారందరికీ నోటీసులు అందించినట్లు వివరించారు. ఏఓఆర్ చెప్పిన విషయాన్ని పరిగణలోకి తీసుకున్న జస్టిస్ సంజీవ్ ఖన్న... ఇతర అప్పీళ్లలో ఉన్న వారికీ నోటీసులు జారీ చేసినట్లు పరిగణిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు దాఖలైన అన్ని కేసుల్లోకి రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ ను ప్రధాన కేసుగా పరిగణలోకి తీసుకొని విచారించనున్నట్లు చెప్పారు. దీనిపై అత్యవసర ప్రాతిపదికన విచారణ చేపట్టాలని కేకేవేణుగోపాల్ కోరగా.... అది సాధ్యం కాదని... రానున్న నెలల్లో రాజ్యాంగ ధర్మాసనాల విచారణ ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది. అగస్టులో విచారించాలని ఏపీ ప్రభుత్వ తరుపు మరో సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ కోరగా... రాజ్యాంగ ధర్మాసనాలు ఉన్నందున అది అసాధ్యమని జస్టిస్ సంజీవ్ ఖన్నా తేల్చి చెప్పారు. సెప్టెంబర్లో చేపట్టాలని కోరగా అది కూడా సాధ్యం కాకపోవచ్చంటూ కేసును డిసెంబర్ కు వాయిదా వేశారు

SC on R5 Zone: ఆర్‌5 జోన్‌ కేసు అమరావతి ధర్మాసనానికి.. రిజిస్ట్రీకి ఆదేశం

Last Updated : Jul 11, 2023, 5:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.