ETV Bharat / bharat

కేరళ సీఎంగా మే20న విజయన్​ ప్రమాణం

author img

By

Published : May 8, 2021, 10:15 PM IST

కేరళలో వరుసగా రెండోసారి విజయకేతనం ఎగురవేసిన పినరయి విజయన్​ సీఎంగా మే 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మంత్రులు అదే రోజు ప్రమాణం చేస్తారు. ఈ కార్యక్రమం తిరువనంతపురంలోని సెంట్రల్​ స్టేడియంలో నిరాడంబరంగా జరగనుంది.

Pinarayi
పినరయి విజయన్

కేరళలో వరుసగా రెండోసారి గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది సీపీఎం నేతృత్వంలోని ఎల్​డీఎఫ్​. పినరయి విజయన్​ మే20న రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తిరువనంతపురంలోని సెంట్రల్​ స్టేడియంలో సాయంత్రం 3 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. గవర్నర్​ ఆరిఫ్​ మహ్మద్​ఖాన్​​ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. కరోనా కారణంగా 2 వేల మంది అతిథులకు మాత్రమే ఈ కార్యక్రమానికి అనుమతి ఉంది.

ఆయనతో పాటు సీపీఎం, సీపీఐ ఇంకా కూటమిలోని పార్టీలనుంచి కొందరు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కూటమి అంతర్గత చర్చల అనంతరం.. ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలన్నది నిర్ణయిస్తారు.

మే 2న వెలువడిన ఫలితాల్లో కేరళలోని మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు వామపక్షకూటమి 99 సీట్లను గెలుచుకుని అధికారాన్ని నిలబెట్టుకుంది. యూడీఎఫ్​​ కేవలం 41 స్థానాలకే పరిమితం అయింది.

ఇదీ చదవండి: 'విజయన్​' ఫార్ములా హిట్- కేరళలో నయా రికార్డ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.