ETV Bharat / bharat

సొంత డబ్బుతో 400 టన్నుల ప్రాణవాయువు

author img

By

Published : Apr 27, 2021, 6:31 AM IST

దేశంలో కరోనా కోరలు చాస్తున్న వేళ.. మహారాష్ట్రకు చెందిన ఓ వ్యాపారవేత్త తన సొంత డబ్బుతో 400 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్​ను స్థానిక ఆసుపత్రులకు సరఫరా చేసి ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ మంచి పని తనకెంతో సంతృప్తిని ఇచ్చిందని వ్యాపారవేత్త ప్యార్​ ఖాన్ తెలిపారు.

Pyare Khan
వ్యాపారవేత్త ప్యార్​ ఖాన్

కరోనా కరాళ నృత్యంతో మహారాష్ట్రలోని నాగ్​పుర్​ జిల్లా వైద్య వ్యవస్థ కుప్పకూలిన తరుణాన ఓ వ్యాపారవేత్త తన ఉదారతను చాటుకున్నాడు. రవాణా వ్యాపారంలో (ట్రాన్స్​పోర్ట్ కంపెనీ) ఉన్న ప్యార్​ ఖాన్​ సొంత డబ్బు వెచ్చించి నాగ్​పుర్ మున్సిపల్​ కార్పొరేషన్, నాగ్​పుర్ జిల్లా పరిధిలోని ఆసుపత్రులకు 400 మెట్రిక్ టన్నుల ప్రాణవాయువును సరఫరా చేశారు. ఇందుకు సొంత నగదు రూ. 85 లక్షలు వెచ్చించారు. 'ప్రస్తుతం రంజాన్ మాసం కొనసాగుతోంది. ఈ మంచి పని నాకెంతో సంతృప్తిని ఇచ్చింది, ఇందుకోసం నేను ఎలాంటి డబ్బులు తీసుకోలేదని ప్యార్​ ఖాన్​ తెలిపారు.

Pyare Khan
ఆక్సిజన్ ట్యాంకర్​తో వ్యాపారవేత్త ప్యార్​ ఖాన్

తొలినాళ్లలో ఆయన ఎన్నో కష్టాలను అనుభవించారు. రైల్వేస్టేషన్ వద్ద నారింజ కాయలు అమ్మేవారు. అనంతరం ఆటోరిక్షా నడిపేవారు. ఆ తర్వాత తల్లి బంగారు నగలు విక్రయించి 2007లో ట్రాన్స్​ పోర్ట్​ కంపెనీ ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన కంపెనీకి భారీ నెట్​వర్క్ ఉంది.

ఇదీ చదవండి : ఆక్సిజన్​ కొరతతో ఆరుగురు రోగులు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.