ETV Bharat / bharat

'స్టాలిన్ నా ఫ్రెండ్.. కథ క్లైమాక్స్​లోనే తెలుస్తుంది'.. పొత్తులపై కమల్​ సినిమా పంచ్! - తమిళనాడు రాజకీయాలు

తమిళనాడులో డీఎంకేతో పొత్తు పెట్టుకునే విషయంపై కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంకే స్టాలిన్​ కింది నుంచి వచ్చిన వ్యక్తి అంటూ కొనియాడారు. అయితే పొత్తుల విషయంపై ఇప్పుడే ఏమీ మాట్లాడలేనని అన్నారు.

Makkal Needhi Maiam alliance with dmk
Makkal Needhi Maiam alliance with dmk
author img

By

Published : Feb 28, 2023, 3:32 PM IST

Updated : Feb 28, 2023, 3:46 PM IST

తమిళనాడులో పొత్తుల విషయంపై మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధినేత కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు సినిమా లెవెల్ డైలాగ్​తో సమాధానం ఇచ్చారు. ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనకు మంచి స్నేహితుడని చెప్పిన కమల్ హాసన్.. ఆయనతో బంధం రాజకీయాలకు అతీతమని తెలిపారు. మార్చి 1న స్టాలిన్ పుట్టిన రోజు నేపథ్యంలో మంగళవారం చెన్నైలో ఆయన ఫొటో గ్యాలరీని ప్రారంభించారు కమల్ హాసన్. రాష్ట్ర మంత్రి పీకే శేఖర్ బాబు, చెన్నై మేయర్ ఆర్ ప్రియ ఆహ్వానం మేరకు కమల్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్రంలో ఏ పార్టీలతో కలిసి పోటీ చేస్తామనే విషయంపై ఇప్పుడే చెప్పలేమని అన్నారు.

"గొప్ప రాజకీయ నేతకు పుట్టిన కుమారుడు ఎంకే స్టాలిన్. కలైంజ్ఞర్ (కరుణానిధి) సినీ పరిశ్రమలో ఉన్నప్పటి నుంచి స్టాలిన్ నాకు తెలుసు. అన్ని సవాళ్లు ఎదుర్కొంటూ క్రమక్రమంగా ఆయన ఈ స్థాయికి వచ్చారు. డీఎంకే కార్యకర్తగా రాజకీయాల్లోకి వచ్చి యూత్ సెక్రెటరీగా, ఎమ్మెల్యేగా, మేయర్​గా, మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఎదిగారు. ఇప్పుడు డీఎంకే అధ్యక్షుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. స్టాలిన్, నేను క్లోజ్ ఫ్రెండ్స్ కాకపోవచ్చు. కానీ మేం స్నేహితులం అనే విషయం అందరికీ తెలిసిందే. మా స్నేహం రాజకీయాలకు అతీతం. ఆయన పార్టీతో పొత్తు పెట్టుకునే విషయంపై ఇప్పుడే ఏమీ చెప్పలేం. ఏ విషయమైనా వెంటనే మనం క్లైమాక్స్​కు వెళ్లిపోకూడదు. ఒక సీన్ తర్వాత ఇంకో సీన్ అన్నట్టు వెళ్తూ ఉండాలి. అలా వెళ్తేనే కథ కొనసాగుతుంది."
-కమల్ హాసన్, మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు

ఐడియాలజీ సేమ్ సేమ్!
అయితే, స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీతో పొత్తును కమల్ హాసన్ కొట్టిపారేయలేదు. పరోక్షంగా ఆ పార్టీతో పొత్తుకు సిద్ధమేనని చెప్పుకొచ్చారు. డీఎంకే పార్టీ భావజాలం తమ పార్టీ భావజాలానికి దగ్గరగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇప్పుడే దీనిపై మాట్లాడలేమంటూ చెప్పుకొచ్చారు.

'ఎప్పటి నుంచో కమల్ మా మిత్రుడు'
మరోవైపు, డీఎంకే ఎంపీ దయానిధి మారన్ సైతం కమల్​పై కీలక వ్యాఖ్యలు చేశారు. 'కమల్ హాసన్ భావసారూప్యత కలిగిన వ్యక్తి. కరుణానిధి, స్టాలిన్​తో పాటు డీఎంకేకు ఆయన ఎప్పటి నుంచో మిత్రుడిగా ఉన్నారు. ఇది స్టాలిన్ 70వ పుట్టినరోజు. ఆయనపై గౌరవంతో కమల్ ఇక్కడికి వచ్చారు. తమిళనాడు సంప్రదాయం ఇదే' అని దయానిధి మారన్ పేర్కొన్నారు. 2024లో సార్వత్రిక ఎన్నికల్లో.. తమిళనాడు, పుదుచ్ఛేరిలో ఉన్న 40 లోక్​సభ స్థానాలను డీఎంకేనే గెలుస్తుందని దయానిధి ధీమా వ్యక్తం చేశారు.

ఇప్పటివరకు ఏ పెద్ద పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదు కమల్ హాసన్. అయితే ఇటీవల ఈరోడ్ తూర్పు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో అనూహ్యంగా కాంగ్రెస్​కు మద్దతు పలికారు. ఆ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే, పెరియార్ రామస్వామి మనవడు తిరుమహన్ హఠాత్తుగా ప్రాణాలు కోల్పోగా.. ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే కాంగ్రెస్, డీఎంకే మధ్య పొత్తు ఉంది. దీంతో స్టాలిన్.. కాంగ్రెస్ అభ్యర్థికే మద్దతు ప్రకటించారు. చివరకు కమల్ హాసన్ కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం సైతం చేశారు.

Last Updated : Feb 28, 2023, 3:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.