ETV Bharat / bharat

బిచ్చగాళ్లపై వేడినీళ్లు పోసిన 'ఎమ్మెల్యే బంధువు'- ముగ్గురు మృతి - మహారాష్ట్ర న్యూస్​

hotel owner killed beggars :హోటల్​ ముందు కూర్చోవద్దని చెప్పినా వినడం లేదంటూ ఆగ్రహానికి గురైన నిర్వాహకుడు.. ముగ్గురు బిచ్చగాళ్లపై వేడి నీళ్లు పోసి చంపాడు. ఈ అమానుష ఘటన మహారాష్ట్రలోని పుణెలో జరిగింది.

hotel owner killed beggars
hotel owner killed beggars
author img

By

Published : Jun 3, 2022, 3:20 PM IST

Updated : Jun 3, 2022, 3:38 PM IST

hotel owner killed beggars : మహారాష్ట్ర పుణెలో అమానుష ఘటన జరిగింది. ముగ్గురు బిచ్చగాళ్లపై వేడినీళ్లు పోసి హత్య చేశాడు ఓ హోటల్​ నిర్వాహకుడు. హోటల్​ ముందు కూర్చోవద్దని చెప్పినా వినకపోవడం వల్ల ఆగ్రహానికి గురైన జయవంత్​.. కర్రలతో కొట్టి తర్వాత వేడి నీళ్లు పోశాడు. తీవ్ర గాయాలపాలైన బిచ్చగాళ్లు మరణించారు. ఈ ఘటన మే 23న సస్వాద్​లో జరగగా.. మే 30న కేసు నమోదు చేశారు పోలీసులు. స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడితోనే నిందితుడిని వదిలేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఇదీ జరిగింది: అహల్యాదేవి మార్కెట్​ సమీపంలో నీలేశ్​ జయవంత్ జగ్తాప్ ఓ హోటల్​ను నిర్వహిస్తున్నాడు. ప్రతిరోజు దాని ఎదుట ముగ్గురు బిచ్చగాళ్లు కూర్చుంటున్నారు. అక్కడ నుంచి వెళ్లమని చెప్పి వారిని కర్రతో కొట్టాడు. అయినా బిచ్చగాళ్లు అక్కడ నుంచి వెళ్లలేదు. దీంతో ఆగ్రహానికి గురైన జయవంత్​ హోటల్​లోని వేడి నీళ్లను తెచ్చి వాళ్లపై పోశాడు. తీవ్ర గాయాలపాలైన బిచ్చగాళ్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

ఈ ఘటన సస్వాడ్​ పోలీస్​ స్టేషన్​కు కూతవేటు దూరంలోనే జరిగింది. అయినా పోలీసులు పట్టించుకోలేదు. చివరకు సస్వాడ్​ పోలీసులు మే30న కేసు నమోదు చేయగా నిందితుడు పరారీలో ఉన్నాడు. మే 23న ఘటన జరగగా.. మే 30న కేసు నమోదు చేశారని.. ఎమ్మెల్యే ఒత్తిడితోనే నిందితుడిని వదిలేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. జయవంత్​ స్థానిక ఎమ్మెల్యే బంధువని తెలిసింది.

ఇదీ చదవండి: కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి- 149 మందికి అస్వస్థత

Last Updated : Jun 3, 2022, 3:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.